శ్రీమద్భగవద్గీత - 111: 02వ అధ్., శ్లో 64 / Bhagavad-Gita - 111: Chap. 02, Ver. 64


🌹. శ్రీమద్భగవద్గీత -111 / Bhagavad-Gita - 111 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 64 🌴


64. రాగద్వేషవిముక్తైస్తు
విషయానిన్ద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా
ప్రసాదమధిగచ్ఛతి ||


🌷. తాత్పర్యం :

కాని సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును మరియు విధి నియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును అగు మనుజడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును.


🌷. భాష్యము :

మనుజుడు బాహ్యముగా ఇంద్రియములను ఏదియోనొక కృత్రిమపద్దతిలో అదుపు చేసినను వానిని శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియోగించనిదే పతనము తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణభక్తియందున్నవాడు బాహ్యమునకు విషయభోగస్థాయిలో నున్నట్లే కనిపించినను తన కృష్ణభక్తిభావన వలన అతడు భోగకర్మల యెడ ఆసక్తిని కలిగియుండడు. అట్టి కృష్ణభక్తుడు కేవలము కృష్ణుని ప్రియమును టపా అన్యమును వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై యుండును. భక్తుడైనవాడు శ్రీకృష్ణుడు కోరినచో సామాన్యముగా అవాంఛనియమైన కార్యము సైతము ఒనరించును.

అలాగుననే కృష్ణుడు కోరకున్నచో సామాన్యముగా తన ప్రీత్యర్థమై ఒనరించు కర్మను సైతము ఒనరింపకుండును. అనగా కేవలము శ్రీకృష్ణుని అధ్యక్షత యందే వర్తించువాడు కావున కర్మ చేయుట లేదా చేయకుండుట యనెడి రెండు విషయములు ఆ భక్తుని అదుపులోనే యుండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని నిర్హేతుక కరుణ మాత్రమే. భోగానుభవస్థితి యందున్నప్పటికిని భక్తుడు దానిని పొందగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 111 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 2 - Sankhya Yoga - 64 🌴


64. rāga-dveṣa-vimuktais tu viṣayān indriyaiś caran
ātma-vaśyair vidheyātmā prasādam adhigacchati


🌷Translation :

But a person free from all attachment and aversion and able to control his senses through regulative principles of freedom can obtain the complete mercy of the Lord.


🌷 Purport :

It is already explained that one may externally control the senses by some artificial process, but unless the senses are engaged in the transcendental service of the Lord, there is every chance of a fall. Although the person in full Kṛṣṇa consciousness may apparently be on the sensual plane, because of his being Kṛṣṇa conscious he has no attachment to sensual activities. The Kṛṣṇa conscious person is concerned only with the satisfaction of Kṛṣṇa, and nothing else.

Therefore he is transcendental to all attachment and detachment. If Kṛṣṇa wants, the devotee can do anything which is ordinarily undesirable; and if Kṛṣṇa does not want, he shall not do that which he would have ordinarily done for his own satisfaction. Therefore to act or not to act is within his control because he acts only under the direction of Kṛiṣhṇa. This consciousness is the causeless mercy of the Lord, which the devotee can achieve in spite of his being attached to the sensual platform.

🌹 🌹 🌹 🌹 🌹

19 Aug 2019