శ్రీమద్భగవద్గీత - 108: 02వ అధ్., శ్లో 61 / Bhagavad-Gita - 108: Chap. 02, Ver. 61


🌹. శ్రీమద్భగవద్గీత - 108 / Bhagavad-Gita - 108 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 61 🌴

61. తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పర: |
వశే హి యస్యేన్ద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||


🌷. తాత్పర్యం :

ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును.


🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన యనునది అత్యున్నత యోగపూర్ణత్వమని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. కృష్ణభక్తిరసభావన లేనిదే ఇంద్రియములపై అదుపు సాధ్యపడదు. గత శ్లోకపు భాస్యములో తెలియజేసినట్లు దుర్వాసుడు భక్త అంబరీషునితో కయ్యమునకు దిగెను.

గర్వకారణమున అతడు అనవసరముగా క్రోధితుడై ఇంద్రియములను నిగ్రహింపజాలకపోయెను. వేరొకప్రక్క రాజు ముని యంతటి శక్తిసంపన్నుడు కాకున్నను భక్తుడైనందున అన్యాయముల నన్నింటిని మౌనముగా సహించి విజయము సాధించెను. శ్రీమద్భాగవతము(9.4.18-20) నందు తెలుపబడినట్లు ఈ క్రింది యోగ్యతల కారణమున ఆ రాజు తన ఇంద్రియములను నియమింపగలిగెను.

స వై మన: కృష్ణపదారవిన్దాయో:
వచాంసి వైకుంఠగుణానువర్ణనే |
కరౌ హరేర్మన్దిరమార్జనాదిషు
శ్రుతిం చకారాచ్యుత సత్కథథోదయే ||

ముకున్దలింగాలయ ముకున్దలింగాలయ దర్శనే దృశౌ
తద్భ్రుత్యగాత్ర స్పర్శేంగ సంగమమ్ |
ఘ్రాణ చ తత్పాదసరోజసౌరభే
శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే ||

పాదౌ హరే: క్షేత్రపదానుసర్పణే
శిరో హృషీ కేశపదాభివన్దనే |
కామం చ దాస్యే న తు కామకామ్యాయా
యథోత్తమశ్లోకజనాశ్రయా రతి: ||

“అంబరీషమహారాజు తన మనస్సును శ్రీకృష్ణభగవానుని పాదపద్మముల చెంత స్థిరముగా నిలిపెను. తన వాక్కును కృష్ణుని ధామమును వర్ణించుట యందు నియోగించును.

తన కరములను కృష్ణుని మందిరములను శుభ్రపరచుట యందును, తన కర్ణములను ఆ ఆ భగవానుని లీలాకథను శ్రవణము చేయుట యందును, తన కన్నులను ఆ దేవదేవుని సుందరమైన రూపమును గాంచుట యందును, తన దేహమును భక్తుల దేహమును స్పృశించుట యందును, తన నాసికను ఆ దేవదేవుని పాదపద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును అస్వాదించుట యందును, తన జిహ్వను భగవానుని అర్పణము గావించిన తులసీదళములను రుచిచూచుట యందును, తన పాదములను అ శ్రీహరి మందిరములు గల తీర్థస్థలములకు ప్రయాణించుట యందును, తన శిరమును ఆ హృషీకేశుని పాదములకు మ్రొక్కుట యందును, తన కోరికలనన్నింటిని ఆ ఉత్తమశ్లోకుని కోరికలను పూర్ణము కావించుట యందును సంపూర్ణముగా వినియోగించెను.” ఈ యోగ్యలతలన్నియును అతని “మత్పర” భక్తునిగా చేసినవి.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 108 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 61 🌴


61. tāni sarvāṇi saṁyamya yukta āsīta mat-paraḥ
vaśe hi yasyendriyāṇi tasya prajñā pratiṣṭhitā


🌷Translation :

One who restrains his senses, keeping them under full control, and fixes his consciousness upon Me, is known as a man of steady intelligence.

🌷 Purport :

That the highest conception of yoga perfection is Kṛṣṇa consciousness is clearly explained in this verse. And unless one is Kṛṣṇa conscious it is not at all possible to control the senses. As cited above, the great sage Durvāsā Muni picked a quarrel with Mahārāja Ambarīṣa, and Durvāsā Muni unnecessarily became angry out of pride and therefore could not check his senses. On the other hand, the king, although not as powerful a yogī as the sage, but a devotee of the Lord, silently tolerated all the sage’s injustices and thereby emerged victorious.

🌹 🌹 🌹 🌹 🌹


16 Aug 2019