శ్రీమద్భగవద్గీత - 119: 02వ అధ్., శ్లో 72 / Bhagavad-Gita - 119: Chap. 02, Ver. 72


🌹. శ్రీమద్భగవద్గీత - 119 / Bhagavad-Gita - 119 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 72 🌴

72. ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామన్తకాలే(పి బ్రహ్మనిర్వాణ మృచ్చతి ||


🌷. తాత్పర్యం :

ఇదియే అధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణ సమయము నందును ఆ విధముగా స్థితుడైనవట్టి వాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును.


🌷. భాష్యము :

కృష్ణభక్తిభావనము (ఆధ్యాత్మిక జీవనము) మనుజడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేక పోవచ్చును. ఇది కేవలము తత్త్వము యొక్క అవగాహన మరియు అంగీకకారముపైననే ఆధారపడి యున్నది. కృష్ణునకు శరణము నొందుట ద్వారా ఖట్వాంగమహారాజు మరణమునకు కొలది నిమిషమునకు ముందే అట్టి జీవనస్థితి పొందగలిగెను. వాస్తవమునకు విషయపూర్ణ జీవనమునకు ముగించుటయే నిర్వాణము.

భౌతికజీవనము తరువాత మిగులునది శూన్యమని భౌద్ధవాదము తెలుపుచుండగా అందులకు భిన్నముగా శ్రీమద్భగవద్గీత ఉపదేశించుచున్నది. అనగా నిజమైన జీవితము భౌతికజీవితపు అంతము పిమ్మట ఆరంభమగుచున్నది. ఈ భౌతికజీవన విధానము ప్రతి యొక్కరు అంతము చేసికొనియే తీరవలెనని తెలిసికొనుట లౌకికునికి సరిపోవును. కాని ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందినవాడు భౌతికజన్మము తదుపరి వేరొక ఆధ్యాత్మికముగా కలదని ఎరుగవలెను. జన్మ ముగియుటకు పూర్వమే మనుజుడు అదృష్టవశమున కృష్ణభక్తిరసభావితుడు అయినచో శీఘ్రమే “బ్రహ్మనిర్వాణస్థితి”ని పొందగలడు.

భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు భేదము లేదు. ఆ రెండును ఒకే పూర్ణత్వస్థాయిలో ఉన్నట్టివి కనుక భగవానుని సేవయందు నిలుచుట యన్నది భగవద్ధామమును పొందినట్లే యగును. భౌతికజగమునందు ఇంద్రియప్రీతి కర్మలుండగా అధ్యాత్మికజగమున కృష్ణపరకర్మలుండును. ఈ జన్మమునందే కృష్ణభక్తిని పొందుట యనునది శీఘ్రమే బ్రహ్మస్థితిని కలుగజేయును. కనుకనే కృష్ణభక్తిరసభావితుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టివాడే యగుచున్నాడు.

బ్రహ్మము భౌతికత్వమునకు వ్యతిరేకమైనది. కనుక “బ్రహ్మీస్థితి” యనగా భౌతిక కర్మకలాపములను కూడిన స్థాయిలో నిలువకుండుట యని అర్థము. శ్రీకృష్ణభగవానునికి ఒనర్చబడు భక్తియుక్తసేవ ముక్తస్థితిగా భగవద్గీత యందు అంగీకరింపబడినది (సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే). కనుకనే బ్రాహ్మీస్థితి భౌతికబంధముల నుండి ముక్తిని పొందినట్టి స్థితియై యున్నది.

భగవద్గీత యొక్క ఈ ద్వితీయాధ్యాయము గీతాసారమని శ్రీల భక్తివినోదఠాకూరులు తెలిపియుండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగములనునవి భగవద్గీత యందలి చర్చనీయాంశములు. ఈ ద్వితీయధ్యాయమున గీతాసారాంశముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా చర్చించబడి భక్తియోగము కొద్దిగా సూచించబడినది.

శ్రీమద్భగవద్గీత యందలి “గీతాసారము” అను ద్వితీయాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 119 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 72 🌴

72. eṣā brāhmī sthitiḥ pārtha naināṁ prāpya vimuhyati
sthitvāsyām anta-kāle ’pi brahma-nirvāṇam ṛcchati


🌷Translation :

That is the way of the spiritual and godly life, after attaining which a man is not bewildered. If one is thus situated even at the hour of death, one can enter into the kingdom of God.

🌷 Purport :

One can attain Kṛṣṇa consciousness or divine life at once, within a second – or one may not attain such a state of life even after millions of births. It is only a matter of understanding and accepting the fact. Khaṭvāṅga Mahārāja attained this state of life just a few minutes before his death, by surrendering unto Kṛṣṇa. Nirvāṇa means ending the process of materialistic life. According to Buddhist philosophy, there is only void after the completion of this material life, but Bhagavad-gītā teaches differently.

Actual life begins after the completion of this material life. For the gross materialist it is sufficient to know that one has to end this materialistic way of life, but for persons who are spiritually advanced, there is another life after this materialistic life. Before ending this life, if one fortunately becomes Kṛṣṇa conscious, he at once attains the stage of brahma-nirvāṇa. There is no difference between the kingdom of God and the devotional service of the Lord.

Thus end the Bhaktivedanta Purports to the Second Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of its Contents.

🌹 🌹 🌹 🌹 🌹


27 Aug 2019