శ్రీమద్భగవద్గీత - 097: 02వ అధ్., శ్లో 50 / Bhagavad-Gita - 097: Chap. 02, Ver. 50
🌹. శ్రీమద్భగవద్గీత - 97 / Bhagavad-Gita - 97 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 50 🌴
50. బుద్ధియుక్తో జహాతీహ
ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్ యోగాయ యుజ్యస్య
యోగ: కర్మసు కౌశలమ్ ||
🌷. తాత్పర్యం :
భక్తియోగ మందు నియుక్తుడైనవాడు ఈ జన్మమందే శుభాశుభఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మ యందలి నేర్పుయైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము.
🌷. భాష్యము :
అనంత కాలము నుండి ప్రతిజీవుడు తన శుభాశుభకర్మల ఫలములను ప్రోగుచేసికొని యున్నాడు. అంతియేగాక తన నిజస్థితి సైతము ఎరుగలేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణభగవానునికి సంపూర్ణ శరణాగతిని పొంది జన్మ,జన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాని ఫలముల శృంఖముల నుండి ముక్తి నొందుమనియే భగవద్గీత జీవునికి భోధించు చున్నది. కనుకనే కర్మఫలములను శుద్ధిచేయు విధానమైనటు వంటి కృష్ణభక్తి రసభావన యందు కర్మనొనరింపుమని అర్జునుడు భోదింపపడినాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 97 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 50 🌴
50. buddhi-yukto jahātīha ubhe sukṛta-duṣkṛte
tasmād yogāya yujyasva yogaḥ karmasu kauśalam
🌷Translation :
A man engaged in devotional service rids himself of both good and bad reactions even in this life. Therefore strive for yoga, which is the art of all work.
🌷 Purport :
Since time immemorial each living entity has accumulated the various reactions of his good and bad work. As such, he is continuously ignorant of his real constitutional position. One’s ignorance can be removed by the instruction of the Bhagavad-gītā, which teaches one to surrender unto Lord Śrī Kṛṣṇa in all respects and become liberated from the chained victimization of action and reaction, birth after birth. Arjuna is therefore advised to act in Kṛṣṇa consciousness, the purifying process of resultant action.
🌹🌹🌹🌹🌹
5 Aug 2019