శ్రీమద్భగవద్గీత - 109: 02వ అధ్., శ్లో 62 / Bhagavad-Gita - 109: Chap. 02, Ver. 62
🌹. శ్రీమద్భగవద్గీత -109 / Bhagavad-Gita - 109 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 62 🌴
62. ధ్యాయతో విషయాన్ పుంస:
సజ్జ్గస్తేఘూపజాయతే |
సజ్ఞ్గాత్సంజాయతే కామ:
కామాత్క్రోధో భిజాయతే ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియార్థములను ధ్యానించునపుడు వాని యెడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధినొందగా, కామము నుండి క్రోధము ఉద్భవించును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు కానివాడు ఇంద్రియార్థములను చింతించునప్పుడు విషయవాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు చక్కని కార్యక్రమము ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణభగవానుని ప్రేమయుక్తసేవ యందు వానిని నియోగించినచో అవి తప్పక విషయసేవనమునందు నిలువగోరును. ఈ భౌతికజగమునందు బ్రహ్మరుద్రాదులతో సహా ప్రతియెక్కరును ఇంద్రియార్థములచే ప్రభావితము చెందెడివారే. అట్టి యెడ స్వర్గలోకములందలి దేవతల గూర్చి వేరుగా తెలుపపనిలేదు.
భౌతికజగత్తు యొక్క ఈ చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణభక్తిభావనాయుతులము అగుటయే ఏకైక మార్గము. ఒకమారు పరమశివుడు ధ్యానమగ్నుడై యుండగా పార్వతీదేవి అతనిని ఇంద్రియప్రీతికై చలింపజేసెను. అందులకు శివుడు అంగీకరించగా కార్తికేయుని జననము కలిగెను. శ్రీకృష్ణభగవానుని భక్తుడైన హరిదాసఠాకూరును సైతము మాయాదేవి అవతారము అదేవిధముగా మొహమునకు గురిచేయు యత్నించెను. కాని యౌవనవంతుడైనను హరదాసుడు శ్రీకృష్ణభగవానుని అంతరంగభక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగెను.
పూర్వపు శ్లోకభాష్యములో శ్రీయామునాచార్యులు తెలియజేసిన రీతి, భగవానుని సాహచర్యములో ఒనగూడు ఆధ్యాత్మికానుభవపు దివ్యరసాస్వాదన కారణమున శుద్ధభక్తుడు సర్వవిధములైన ఇంద్రియభోగములను వర్ణించును. భక్తుల ఆధ్యాత్మికవిజయపు రహస్యమిదియే. కావున కృష్ణభక్తిరసభావితుడు కానివాడు ఇంద్రియముల కృత్రిమదమనమునందు ఎంతటి శక్తిసంపన్నుడైనను అంత్యమున విఫలత్వమునే పొందగలడు. ఇంద్రియప్రీతిని గూర్చిన లేశమాత్ర చింతయైనను కోరికల పూర్ణము కొరకై అతనిని కలతపరచుటయే అందులకు కారణము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 109 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga- 62 🌴
62. dhyāyato viṣayān puṁsaḥ saṅgas teṣūpajāyate
saṅgāt sañjāyate kāmaḥ kāmāt krodho ’bhijāyate
🌷Translation :
While contemplating the objects of the senses, a person develops attachment for them, and from such attachment lust develops, and from lust anger arises.
🌷 Purport :
One who is not Kṛṣṇa conscious is subjected to material desires while contemplating the objects of the senses. The senses require real engagements, and if they are not engaged in the transcendental loving service of the Lord, they will certainly seek engagement in the service of materialism.
In the material world everyone, including Lord Śiva and Lord Brahmā – to say nothing of other demigods in the heavenly planets – is subjected to the influence of sense objects, and the only method to get out of this puzzle of material existence is to become Kṛṣṇa conscious.
Lord Śiva was deep in meditation, but when Pārvatī agitated him for sense pleasure, he agreed to the proposal, and as a result Kārtikeya was born. When Haridāsa Ṭhākura was a young devotee of the Lord, he was similarly allured by the incarnation of Māyā-devī, but Haridāsa easily passed the test because of his unalloyed devotion to Lord Kṛṣṇa.
As illustrated in the above-mentioned verse of Śrī Yāmunācārya, a sincere devotee of the Lord shuns all material sense enjoyment due to his higher taste for spiritual enjoyment in the association of the Lord. That is the secret of success. One who is not, therefore, in Kṛṣṇa consciousness, however powerful he may be in controlling the senses by artificial repression, is sure ultimately to fail, for the slightest thought of sense pleasure will agitate him to gratify his desires.
🌹 🌹 🌹 🌹 🌹
17 Aug 2019