🌹. శ్రీమద్భగవద్గీత -121 / Bhagavad-Gita - 121 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 2 🌴
2. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మెహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో(హమాప్నుయామ్ ||
🌷. తాత్పర్యం :
అనేకార్థములు కలిగిన నీ భోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయుము.
🌷. భాష్యము :
భగవద్గీత ఉపోద్ఘాతముగా గడచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచే ఇంద్రియనిగ్రహము, ఫలాపేక్షరహిత కర్మము, ప్రారంభదశలో గల సాధకుని స్థితులనెడి వివిధ విషయములు వర్ణింపబడినవి. కాని అవియన్నియును ఒక క్రమపద్దతిలో వివరింపబడలేదు. వాని సంపూర్ణావగాహనకు మరియు ఆచరణకు ఒక క్రమపద్ధతి అత్యంత అవసరమై యున్నది.
కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను సంపూర్ణముగా తెలియనెంచెను. తద్ద్వారా సాధారణవ్యక్తి సైతము వాటిని ఎటువంటి కల్పనలు మరియు వ్యతిరేకవివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పదప్రయోగాముచే అర్జుని అర్జునుని తన ప్రశ్నల ద్వారా భగవద్గీత అంతరార్థమును తెలిసికొనగోరు నిష్టాపూర్ణులకు కృష్ణభక్తిరసభావనా మార్గము సుగమము చేయుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 121 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 02 🌴
2. vyāmiśreṇeva vākyena buddhiṁ mohayasīva me
tad ekaṁ vada niścitya yena śreyo ’ham āpnuyām
🌷Translation :
My intelligence is bewildered by Your equivocal instructions. Therefore, please tell me decisively which will be most beneficial for me.
🌷 Purport :
In the previous chapter, as a prelude to the Bhagavad-gītā, many different paths were explained, such as sāṅkhya-yoga, buddhi-yoga, control of the senses by intelligence, work without fruitive desire, and the position of the neophyte. This was all presented unsystematically. A more organized outline of the path would be necessary for action and understanding.
Arjuna, therefore, wanted to clear up these apparently confusing matters so that any common man could accept them without misinterpretation. Although Kṛṣṇa had no intention of confusing Arjuna by any jugglery of words, Arjuna could not follow the process of Kṛṣṇa consciousness – either by inertia or by active service. In other words, by his questions he is clearing the path of Kṛṣṇa consciousness for all students who seriously want to understand the mystery of the Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
29 Aug 2019