🌹. శ్రీమద్భగవద్గీత -120 / Bhagavad-Gita - 120 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 1 🌴
1. అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్ కర్మణస్తే
మతా బుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే
మాం నియోజయసి కేశవ ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు ఈ విధంగా అన్నాడు. కృష్ణా! కర్మముకంటే జ్ఞానమే మేలని నీ అభిప్రాయముగ అనిపించుచున్నది. ఇదియే నీ అభిప్రాయం అయినచో, నన్ను, హింసారూపమై క్రూరమైనట్టి యుద్ధాఖ్యకర్మమునే చేయుము అని నీవు నియోగించుటకు కారణముయేమి? చెప్పుము అని భావము.
🌷. భాష్యము :
పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు తన సన్నిహిత స్నేహితుడైన అర్జునుని దుఃఖసాగరము నుండి ఉద్ధరింపజేయు ఉద్దేశ్యముతో ఆత్మ యొక్క నిజస్థితిని గడచిన అధ్యాయమునందు విపులముగా వివరించెను. అంతియేగాక ఆత్మానుభవమార్గమైన బుద్ధియోగమును( కృష్ణభక్తిరసభావనము) సైతము ప్రతిపాదించును.
కొన్నిమార్లు కృష్ణభక్తిభావము జడత్వమని తప్పుగా భావింపబడును. అ విధముగా అపార్థము చేసికొనినవాడు పవిత్ర కృష్ణనామమును జపించును పూర్ణ కృష్ణభక్తియుతుడగుటకు ఏకాంతస్థలమునకు చనుచుండును. కాని కృష్ణభక్తి తత్త్వమున సంపూర్ణముగా శిక్షణను పొందనిదే ఏకాంతస్థలములో కృష్ణనామజపమును చేయుట హితకరము కాదు. అట్టి కార్యము వలన కేవలము అమాయకజనులచే భక్తిప్రశంశలు మాత్రమే మనుజునకు లభింపగలవు. అర్జునుడు సైతము కృష్ణభక్తిభావన (బుద్ధియోగము లేదా ఆధ్యాత్మికజ్ఞానమునందు బుద్ధి) యనగా క్రియాశీలక జీవనము నుండి విరణమును పొంది ఏకాంతస్థలములో తపోధ్యానము చేయుట యని భావించెను.
అనగా కృష్ణభక్తి నెపమున అతడు యుద్ధము నుండి తెలివితో విరమింపగోరెను. కాని అతడు ఉత్తమవిద్యార్థి వలె తన గురువు ఎదుట ఈ విషయముంచి ఉత్తమమార్గామేదియో తనకు తెలుపుమని ప్రశ్నించెను. అర్జునిని ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు కర్మయోగమును (కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించు విధానము) ఈ తృతీయాధ్యాయమున విపులముగా వివరించాను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 120 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 1 🌴
1. arjuna uvāca
jyāyasī cet karmaṇas te matā buddhir janārdana
tat kiṁ karmaṇi ghore māṁ niyojayasi keśava
🌷Translation :
Arjuna said: O Janārdana, O Keśava, why do You want to engage me in this ghastly warfare, if You think that intelligence is better than fruitive work?
🌷 Purport :
The Supreme Personality of Godhead Śrī Kṛṣṇa has very elaborately described the constitution of the soul in the previous chapter, with a view to delivering His intimate friend Arjuna from the ocean of material grief. And the path of realization has been recommended: buddhi-yoga, or Kṛṣṇa consciousness.
Sometimes Kṛṣṇa consciousness is misunderstood to be inertia, and one with such a misunderstanding often withdraws to a secluded place to become fully Kṛṣṇa conscious by chanting the holy name of Lord Kṛṣṇa. But without being trained in the philosophy of Kṛṣṇa consciousness, it is not advisable to chant the holy name of Kṛṣṇa in a secluded place, where one may acquire only cheap adoration from the innocent public.
Arjuna also thought of Kṛṣṇa consciousness or buddhi-yoga, or intelligence in spiritual advancement of knowledge, as something like retirement from active life and the practice of penance and austerity at a secluded place. In other words, he wanted to skillfully avoid the fighting by using Kṛṣṇa consciousness as an excuse. But as a sincere student, he placed the matter before his master and questioned Kṛṣṇa as to his best course of action. In answer, Lord Kṛṣṇa elaborately explained karma-yoga, or work in Kṛṣṇa consciousness, in this Third Chapter.
🌹 🌹 🌹 🌹 🌹
28 Aug 2019