🌹. శ్రీమద్భగవద్గీత-118 / Bhagavad-Gita - 118 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 71 🌴
71. విహాయ కామాన్ య: సర్వాన్
పుమాంశ్చరతి నిస్పృహ: |
నిర్మమో నిరహంకార:
స శాన్తిమధిగచ్చతి ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియభోగానుభవ కోరికల నన్నింటిని త్యజించి నిష్కామునిగా జీవించుచు, మమకారము మరియు మిథ్యాహంకారము వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును.
🌷. భాష్యము :
నిష్కామత్వమనగా ఇంద్రియభోగము కొరకై దేనిని వాచింపకుండుట యని భావము. అనగా కృష్ణభక్తియందు నిలువగోరుటయే నిజమైన నిష్కామత్వము. దేహాత్మభావనము మరియు జగమునందలి దేనిపైనను యజమానిత్వమును కలిగియుండక శ్రీకృష్ణుని దాసునిగా మనుజుని వాస్తస్థితిని అవగతము చేసికొనుటయే కృష్ణభక్తిభావనయందలి పూర్ణత్వస్థితి. అట్టి పూర్ణత్వస్థితి యందు నెలకొనినవాడు శ్రీకృష్ణుడే సకలమునకు అధిపతి కనుక సమస్తమును అతని ప్రీత్యర్థమే నియోగింపబడవలెనని ఎరిగియుండును. అర్జునుడు తొలుత తన ప్రీత్యర్థమై యుద్దమును నిరాకరించినను కృష్ణభక్తిభావనాయుతుడు అయినంతనే యుద్ధము నొనరించెను. అతడు యుద్ధము నందు పాల్గొనవలెనని శ్రీకృష్ణుడు వాంచించి యుండుటయే అందులకు కారణము.
యుద్ధము చేయవలెననెడి కోరిక తనకు లేకున్నను కృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధము చేసెను. కృత్రిమముగా కోరికలను నశింపజేయుట కన్నను కృష్ణుని ప్రియమును వాంచించుట యనునది నిజమైన నిష్కామత్వమై యున్నది. జీవుడేజీవుడెన్నడు వాంఛారహితుడు కాజాలడు. కాని అతడు తన కోరికల పద్ధతిని(గుణమును) మార్చుకొనవలయును. భౌతికవాంఛారహితుడైన వ్యక్తి సమస్తము శ్రీకృష్ణునకే చెందినదని (ఈశావాస్యమిదం సర్వమ్) తెలిసియుండును కావున దేనిపైనను వ్యర్థముగా యజమానిత్వమును కలిగియుండడు.
ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణునికి నిత్యాంశయైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడును శ్రీకృష్ణునితో సమానుడు కాని, అధికుడు కాని కాజాలడనెడి ఆత్మానుభవము పైననే ఈ దివ్యజ్ఞానము ఆధారపడియున్నది. ఇట్టి కృష్ణభక్తిరసభావన యొక్క అవగాహనయే శాంతికి మూలసిద్ధాంతమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 118 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 71 🌴
71. vihāya kāmān yaḥ sarvān pumāṁś carati niḥspṛhaḥ
nirmamo nirahaṅkāraḥ sa śāntim adhigacchati
🌷Translation :
A person who has given up all desires for sense gratification, who lives free from desires, who has given up all sense of proprietorship and is devoid of false ego – he alone can attain real peace.
🌷 Purport :
To become desireless means not to desire anything for sense gratification. In other words, desire for becoming Kṛṣṇa conscious is actually desirelessness. To understand one’s actual position as the eternal servitor of Kṛṣṇa, without falsely claiming this material body to be oneself and without falsely claiming proprietorship over anything in the world, is the perfect stage of Kṛṣṇa consciousness.
One who is situated in this perfect stage knows that because Kṛṣṇa is the proprietor of everything, everything must be used for the satisfaction of Kṛṣṇa. Arjuna did not want to fight for his own sense satisfaction, but when he became fully Kṛṣṇa conscious he fought because Kṛṣṇa wanted him to fight. For himself there was no desire to fight, but for Kṛṣṇa the same Arjuna fought to his best ability.
Real desirelessness is desire for the satisfaction of Kṛṣṇa, not an artificial attempt to abolish desires. The living entity cannot be desireless or senseless, but he does have to change the quality of the desires. A materially desireless person certainly knows that everything belongs to Kṛṣṇa (īśāvāsyam idaṁ sarvam), and therefore he does not falsely claim proprietorship over anything.
This transcendental knowledge is based on self-realization – namely, knowing perfectly well that every living entity is an eternal part and parcel of Kṛṣṇa in spiritual identity, and that the eternal position of the living entity is therefore never on the level of Kṛṣṇa or greater than Him. This understanding of Kṛṣṇa consciousness is the basic principle of real peace.
🌹 🌹 🌹 🌹 🌹
26 Aug 2019