శ్రీమద్భగవద్గీత - 100: 02వ అధ్., శ్లో 53 / Bhagavad-Gita - 100: Chap. 02, Ver. 53
🌹. శ్రీమద్భగవద్గీత -100 / Bhagavad-Gita - 100 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 53 🌴
53. శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ||
🌷. తాత్పర్యం :
ఎప్పుడు నీ మనస్సు వేదముల మధుర వాక్కులచే కలత నొందక ఆత్మానుభూతి యనెడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడగుదువు.
🌷. భాష్యము :
మనుజుడు సమాధిమగ్నుడైనాడని పలుకుట అతడు కృష్ణభక్తి రసభావనను సంపూర్ణముగా అనుభూత మొనర్చుకొనినాడని పలుకుటయే కాగలదు. అనగా సమాధిమగ్నుడైనవాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది తత్త్వముల అనుభూతిని బడసి యుండును. మనుజుడు శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనియు మరియు కృష్ణభక్తి భావనలో కర్మల నొనరించుటయే నిజ ధర్మమనియు ఎరుగుటయే ఆత్మానుభవము నందు పూర్ణత్వస్థితి.
కృష్ణభక్తి పరాయణుడు (శ్రద్దావంతుడైన భక్తుడు) ఎన్నడును వేదముల పుష్పిత వాక్కులచే కలత నొందరాదు. అంతియే గాక స్వర్గాదులను పొందుటకై కామ్యకర్మల యందు నియుక్తుడు కారాదు. కృష్ణభక్తి రసభావన యందు మనుజడు శ్రీకృష్ణునితో ప్రత్యక్షముగా అనోన్య సంబంధము పొందును గనుక భగవానుని ఆదేశములను అతడు అట్టి దివ్యస్థితి యందే నిలిచి గ్రహించ గలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక ఫలమును బడసి చరమ జ్ఞానమును పొందగలడు. దాని కొరకై మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధియైన గురువు ఆదేశములను మాత్రము నిర్వహింప వలసి యుండును .
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 100 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 53 🌴
53. śruti-vipratipannā te yadā sthāsyati niścalā
samādhāv acalā buddhis tadā yogam avāpsyasi
🌷Translation :
When your mind is no longer disturbed by the flowery language of the Vedas, and when it remains fixed in the trance of self-realization, then you will have attained the divine consciousness.
🌷 Purport :
To say that one is in samādhi is to say that one has fully realized Kṛṣṇa consciousness; that is, one in full samādhi has realized Brahman, Paramātmā and Bhagavān. The highest perfection of self-realization is to understand that one is eternally the servitor of Kṛṣṇa and that one’s only business is to discharge one’s duties in Kṛṣṇa consciousness.
A Kṛṣṇa conscious person, or unflinching devotee of the Lord, should not be disturbed by the flowery language of the Vedas nor be engaged in fruitive activities for promotion to the heavenly kingdom. In Kṛṣṇa consciousness, one comes directly into communion with Kṛṣṇa, and thus all directions from Kṛṣṇa may be understood in that transcendental state.
One is sure to achieve results by such activities and attain conclusive knowledge. One has only to carry out the orders of Kṛṣṇa or His representative, the spiritual master.
🌹 🌹 🌹 🌹 🌹
8 Aug 2019