🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 95 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 48 🌴
48. యోగస్థ కురు కర్మాణి సజ్ఞం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యో: సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విధ్యుక్తధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావానమే యోగామనబడును.
🌻. భాష్యము :
యోగమునందు వర్తించుమని అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. ఆ యోగమనగా నేమి? సదా కలతపెట్టు ఇంద్రియములను అదుపుజేసి భగవానుని యందు మనస్సును సంలగ్నము చేయుటయే యోగము. మరి ఆ భగవానుదెవ్వరు? దేవదేవుడైన? శ్రీకృష్ణుడే భగవానుడు.
అట్టి శ్రీకృష్ణుడే స్వయముగా యుద్ధము చేయుమని పలుకుచున్నందున యుద్ధఫలములతో అర్జునునకు ఎట్టి సంబంధము లేదు. లాభము లేదా జయమనెడి విషయము శ్రీకృష్ణుడే చూచు కొనగలడు. కనుకనే కేవలము తన ఆదేశానుసారము వర్తించుమని అర్జునుడు శ్రీకృష్ణునిచే ఉపదేశింప బడినాడు.
శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించుటయే నిజమైన యోగము. అట్టి విధానము కృష్ణభక్తిరస భావన యందు పాటింపబడును. కృష్ణభక్తిభావన యందే మనుజుడు తాను యజమానినడి భావనను త్యజింపగలడు. కావున శ్రీకృష్ణునకు లేదా శ్రీకృష్ణుని దాసునకు అతడు దాసుడు కావలెను. కృష్ణభక్తిరసభావన యందు కర్మనొనరించుటకు అదియే సరియైన మార్గము. అట్టి మార్గమే యోగమునందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు.
అర్జునుడు క్షత్రియుడు మరియు వర్ణాశ్రమ ధర్మవిధానము పాటించువాడు. వర్ణాశ్రమధర్మముల ముఖ్యోద్దేశము విష్ణువును సంతృప్తిపరచుటయేనని విష్ణుపురాణము నందు తెలుపబడినది. ఈ భౌతికజగమునందు ప్రతియొక్కరు స్వీయతృప్తినే వాంచింతురు. కాని వాస్తవమునకు ప్రతియొక్కరు శ్రీకృష్ణునే సంతృప్తిపరుచవలెను గాని స్వీయసంతృప్తికై ఆరాటపడరాదుపడరాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తిపరుపనిదే వర్ణాశ్రమధర్మ నియమములను ఎవ్వరును చక్కగా పాటించలేరు. శ్రీకృష్ణుడు తెలిపిన రీతిగా వర్తింపవలెనని అర్జునుడు పరోక్షముగా భోధింపబడుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 95 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 48 🌴
48. yoga-sthaḥ kuru karmāṇi saṅgaṁ tyaktvā dhanañ-jaya siddhy- asiddhyoḥ samo bhūtvā samatvaṁ yoga ucyate
🌻 Translation :
Perform your duty equipoised, O Arjuna, abandoning all attachment to success or failure. Such equanimity is called yoga.
🌻 Purport :
Kṛṣṇa tells Arjuna that he should act in yoga. And what is that yoga? Yoga means to concentrate the mind upon the Supreme by controlling the ever-disturbing senses. And who is the Supreme? The Supreme is the Lord. And because He Himself is telling Arjuna to fight, Arjuna has nothing to do with the results of the fight. Gain or victory are Kṛṣṇa’s concern; Arjuna is simply advised to act according to the dictation of Kṛṣṇa.
The following of Kṛṣṇa’s dictation is real yoga, and this is practiced in the process called Kṛṣṇa consciousness. By Kṛṣṇa consciousness only can one give up the sense of proprietorship. One has to become the servant of Kṛṣṇa, or the servant of the servant of Kṛṣṇa. That is the right way to discharge duty in Kṛṣṇa consciousness, which alone can help one to act in yoga.
Arjuna is a kṣatriya, and as such he is participating in the varṇāśrama-dharma institution. It is said in the Viṣṇu Purāṇa that in the varṇāśrama-dharma, the whole aim is to satisfy Viṣṇu. No one should satisfy himself, as is the rule in the material world, but one should satisfy Kṛṣṇa. So unless one satisfies Kṛṣṇa, one cannot correctly observe the principles of varṇāśrama-dharma. Indirectly, Arjuna was advised to act as Kṛṣṇa told him.
🌹 🌹 🌹 🌹 🌹
3 Aug 2019