🌹. శ్రీమద్భగవద్గీత - 123 / Bhagavad-Gita - 123 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 4 🌴
4. న కర్మణామనారమ్భాత్
నైష్కర్యం పురుషోశ్నుతే |
న చ సన్న్యసనాదేవ
సిద్ధిం సమధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్న్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు.
🌷. భాష్యము :
లౌకికజనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విధ్యక్తధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనపుడు మనుజుడు సన్న్యాసమును స్వీకరించుట ద్వారా జయము సిద్ధింపదు. సాంఖ్య తత్త్వవేత్తల ఉద్దేశ్యము ప్రకారము కేవలము సన్న్యాసము స్వీకరించినంతనే (కామ్యకర్మల నుండి విరమించినంతనే ) మనుజుడు నారాయణునితో సమానుడు కాగలడు. కాని శ్రీకృష్ణభగవానుడు ఈ సిద్ధాంతము అంగీకరించుట లేదు.
హృదయము పవిత్రము కానిదే సన్న్యాసమును స్వీకరించినచో అది కేవలము సాంఘికవ్యవస్థ సంక్షోభమునకే కారణము కాగలదు. కాని ఒకవేళ మనుజడు తన విధ్యుక్తధర్మములను నిర్వర్తింపకున్నను భగవానుని దివ్యసేవను స్వీకరించి తన శక్త్యానుసారము పురోగమించినచో (బుద్ధియోగము) భగవానునిచో ఆమోదింపబడును. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ – అట్టి ధర్మాచరణము కొద్దిగా ఒనరింపబడినను మనుజుని గొప్ప సంకటముల నుండి తరింపజేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 123 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 4 🌴
4. na karmaṇām anārambhān naiṣkarmyaṁ puruṣo ’śnute
na ca sannyasanād eva siddhiṁ samadhigacchati
🌷Translation :
Not by merely abstaining from work can one achieve freedom from reaction, nor by renunciation alone can one attain perfection.
🌷 Purport :
The renounced order of life can be accepted when one has been purified by the discharge of the prescribed form of duties which are laid down just to purify the hearts of materialistic men. Without purification, one cannot attain success by abruptly adopting the fourth order of life (sannyāsa). According to the empirical philosophers, simply by adopting sannyāsa, or retiring from fruitive activities, one at once becomes as good as Nārāyaṇa.
But Lord Kṛṣṇa does not approve this principle. Without purification of heart, sannyāsa is simply a disturbance to the social order. On the other hand, if someone takes to the transcendental service of the Lord, even without discharging his prescribed duties, whatever he may be able to advance in the cause is accepted by the Lord (buddhi-yoga). Sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt. Even a slight performance of such a principle enables one to overcome great difficulties.
🌹 🌹 🌹 🌹 🌹
31 Aug 2019