శ్రీమద్భగవద్గీత - 126: 03వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 126: Chap. 03, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత -126 / Bhagavad-Gita - 126 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 7 🌴

యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేర్జున |
కర్మేన్ద్రియై: కర్మయోగమసక్త: స విశిష్యతే ||

🌷. తాత్పర్యం :

అట్లు గాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుట యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును (కృష్ణభక్తిరసభావన యందు) ఆరంభించు శ్రద్దావంతుడు అత్యుత్తముడు.

🌷. భాష్యము :

యథేచ్చాజీవనము మరియు ఇంద్రియభోగముల కొరకు కపటయోగిగా వర్తించుట కన్నను, భవబంధము నుండి ముక్తిని కలిగించి భగవద్దామమును ప్రవేశింపచేయు స్వధర్మమున నిలిచి జీవితలక్ష్యము కొరకై ప్రయత్నించుట అత్యంత ఉత్తమము. వాస్తమునకు నిజమైన స్వార్థగతి లేదా జీవితపరమార్థము విష్ణువును చేరుటయే. ఈ జీవితలక్ష్యమును సాధించుటలో మనకు తోడ్పడు విధముగనే వర్ణాశ్రమపద్ధతులు ఏర్పాటు చేయబడినవి.

అనగా గృహస్థుడు కుడా కృష్ణభక్తిభావన యందలి నియమిత సేవ ద్వారా ఈ గమ్యమును చేరగలడు. ఆత్మానుభావము కొరకై ప్రతియొక్కరు శాస్త్రములలో తెలుపబడిన రీతి నియమిత జీవనమును సాగించుచు సంగరహితముగా తమ కర్మ నొనరించినచో పురోభివృద్ధిని పొందగలరు.

ఈ విధానము అనుసరించు శ్రద్దావంతుడు అమాయకులను మోసగించుటకై కపటభక్తిని ప్రదర్శించు కపటయోగి కన్నను అత్యంత ఉత్తముడు. కేవలము జీవనార్థమై కపటధ్యానము చేయువాని కన్నను శ్రద్ధగా వీధులను శుభ్రపరచువాడు ఉత్తముడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 126 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 7 🌴

yas tv indriyāṇi manasā niyamyārabhate ’rjuna
karmendriyaiḥ karma-yogam asaktaḥ sa viśiṣyate

🌷Translation :

On the other hand, if a sincere person tries to control the active senses by the mind and begins karma-yoga [in Kṛṣṇa consciousness] without attachment, he is by far superior.

🌷 Purport :

Instead of becoming a pseudo transcendentalist for the sake of wanton living and sense enjoyment, it is far better to remain in one’s own business and execute the purpose of life, which is to get free from material bondage and enter into the kingdom of God. The prime svārtha-gati, or goal of self-interest, is to reach Viṣṇu.

The whole institution of varṇa and āśrama is designed to help us reach this goal of life. A householder can also reach this destination by regulated service in Kṛṣṇa consciousness. For self-realization, one can live a controlled life, as prescribed in the śāstras, and continue carrying out his business without attachment, and in that way make progress.

A sincere person who follows this method is far better situated than the false pretender who adopts show-bottle spiritualism to cheat the innocent public. A sincere sweeper in the street is far better than the charlatan meditator who meditates only for the sake of making a living.

🌹 🌹 🌹 🌹 🌹

03 Sep 2019