శ్రీమద్భగవద్గీత - 143: 03వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 143: Chap. 03, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత -143 / Bhagavad-Gita - 143 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 24 🌴


24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదాహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమా: ప్రజా: ||


🌷. తాత్పర్యం :

విధ్యుక్తధర్మమములను నేను నిర్వహింపనిచో లోకములన్నియును నాశామును పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడనై తద్ద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరచిన వాడనగుదును.


🌷. భాష్యము :

వర్ణసంకరమనగా మానవసంఘము యొక్క శాంతిని చెరచునటువంటి అవాంఛనీయ జనబాహుళ్యమని భావము. సంఘపు ఈ శాంతి భగ్నతను నివారించుటకే విధినియమములను నిర్ణయింపబడినవి. వాటి ద్వారా మనుజులు అప్రయత్నముగా శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు.

శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అట్టి నియమనిభందనలు గౌరవము మరియు అవసరములు కొనసాగు రీతిలో వాటిని అనుసరించును. శ్రీకృష్ణభగవానుడు జీవులందరినీ తండ్రి గనుక ఒకవేళ జీవులు తప్పుదారి పట్టినచో ఆ భాద్యత పరోక్షముగా అతనికే చెందును. కనుకనే ఎప్పుడు ధర్మనియమముల యెడ అగౌరము పొడసూపునో అప్పుడు అతడు అవతరించి సంఘము సరిచేయును.

భగవానుని అడుగుజాడలలో నుడవవలసియున్నను ఎన్నడును అతనిని అనుకరించలేమనెడి సత్యమును మనము ఎరిగి యుండవలెను. అనుసరించుట మరియు అనుకరించుట యనునవి సమానమైనవి కావు. ఉదాహరణమునకు శ్రీకృష్ణుడు బాల్యములో చూపిన గోవర్ధనోద్ధరణమును మనము అనుసరింప లేము. ఏ మానవునికైనను అది అసాధ్యమైనదే. అనగా అతని ఉపదేశములను మనము అనుసరించగలము కాని ఎన్నడును అతనిని అనుకరింపలేము.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 143 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 24 🌴


24. utsīdeyur ime lokā na kuryāṁ karma ced aham
saṅkarasya ca kartā syām upahanyām imāḥ prajāḥ


🌷Translation :

If I did not perform prescribed duties, all these worlds would be put to ruination. I would be the cause of creating unwanted population, and I would thereby destroy the peace of all living beings.


🌷 Purport :

Varṇa-saṅkara is unwanted population which disturbs the peace of the general society. In order to check this social disturbance, there are prescribed rules and regulations by which the population can automatically become peaceful and organized for spiritual progress in life. When Lord Kṛṣṇa descends, naturally He deals with such rules and regulations in order to maintain the prestige and necessity of such important performances. The Lord is the father of all living entities, and if the living entities are misguided, indirectly the responsibility goes to the Lord.

Therefore, whenever there is general disregard of regulative principles, the Lord Himself descends and corrects the society. We should, however, note carefully that although we have to follow in the footsteps of the Lord, we still have to remember that we cannot imitate Him. Following and imitating are not on the same level. We cannot imitate the Lord by lifting Govardhana Hill, as the Lord did in His childhood. It is impossible for any human being. We have to follow His instructions, but we may not imitate Him at any time.

🌹 🌹 🌹 🌹 🌹


20 Sept 2019