శ్రీమద్భగవద్గీత - 148: 03వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 148: Chap. 03, Ver. 29
🌹. శ్రీమద్భగవద్గీత -148 / Bhagavad-Gita - 148 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 29 🌴
29. ప్రకృతేర్గుణసమ్మూఢా: సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ||
🌷. తాత్పర్యం :
ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతికకర్మల యందు సంపూర్ణముగా నియుక్తులైన సంగత్వము నొందుదురు. కర్తయొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు.
🌷. భాష్యము :
జ్ఞానవిహీనులైన మనుజులు స్థూల భౌతికచైతన్యముతో తాదాత్మ్యము చెందియుండి భౌతికఉపాధుల భావనలో మునిగియుందురు. ఈ దేహము భౌతికప్రకృతి యొక్క వారము వంటిది. అట్టి దేహమునందు తాదాత్మ్యము చెందియుండువాడు మందుడు లేదా ఆత్మనెరుగని అలసుదని పిలువబడును. అజ్ఞానులైనవారు దేహమునే ఆత్మగా భావింతురు. అట్టివారు దేహమునకు సంబంధించినవారిని బంధువులుగా భావించును, జన్మనొసగిన స్థలమును పూజనీయస్థానముగా తలచుచు, ధర్మకార్యముల ఉద్దేశ్యము కేవలము నిర్వహించుట కొరకే యని భావింతురు.
సాంఘికసేవ, జాతీయభావము, పరహితమును వాంచించుట యనునవి అట్టి భౌతికజగమునందు క్షణకాలమును తీరిక లేకుండా వర్తింతురు. వారికి ఆధ్యాత్మికానుభవము ఒక మిథ్య. కనుక వారు దాని యందు ఆసక్తిని కనబరచరు. అయినను ఆధ్యాత్మికజీవనమున జ్ఞానవికాసము నొందినవారు అట్టి విషయపూర్ణ చిత్తులను కలతపెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతముగా కొనసాగించవలెను. అట్టి మోహగ్రస్థ మానవులను అహింస మరియు లౌకిక ఉపకార కార్యముల వంటి ప్రాథమిక నీతిధర్మములందు నియుక్తులను చేయవచ్చును.
అజ్ఞానులైనవారు కృష్ణభక్తిభావన యందలి కర్మలను అర్థము చేసికొనజాలరు. కావున అట్టివారిని కలతపెట్టరాదనియు మరియు ఆ విధముగా విలువైన కాలమును వృథాపరుపరాదనియు శ్రీకృష్ణభగవానుడు మనకు ఉపదేశించుచున్నాడు. కాని ఆ భగవానుని ఉద్దేశము తెలిసియుండెడి కారణము భక్తులు అతని కన్నను అధిక కరుణను కలిగియుందురు. తత్కారణమున వారు మూఢులను కృష్ణపరకర్మల యందు నియుక్తులను చేయ యత్నించుట వంటి పలురకముల విపత్తులనైనను స్వీకరింతురు. అటువంటి కృష్ణపరకర్మలే మానవునకు అత్యంత అవసరములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 148 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 29 🌴
29. prakṛter guṇa-sammūḍhāḥ sajjante guṇa-karmasu
tān akṛtsna-vido mandān kṛtsna-vin na vicālayet
🌷 Translation :
Bewildered by the modes of material nature, the ignorant fully engage themselves in material activities and become attached. But the wise should not unsettle them, although these duties are inferior due to the performers’ lack of knowledge.
🌷 Purport :
Persons who are unknowledgeable falsely identify with gross material consciousness and are full of material designations. This body is a gift of the material nature, and one who is too much attached to the bodily consciousness is called manda, or a lazy person without understanding of spirit soul. Ignorant men think of the body as the self; they accept bodily connections with others as kinsmanship, the land in which the body is obtained is their object of worship, and they consider the formalities of religious rituals to be ends in themselves.
Social work, nationalism and altruism are some of the activities for such materially designated persons. Under the spell of such designations, they are always busy in the material field; for them spiritual realization is a myth, and so they are not interested. Those who are enlightened in spiritual life, however, should not try to agitate such materially engrossed persons. Better to prosecute one’s own spiritual activities silently. Such bewildered persons may be engaged in such primary moral principles of life as nonviolence and similar materially benevolent work.
Men who are ignorant cannot appreciate activities in Kṛṣṇa consciousness, and therefore Lord Kṛṣṇa advises us not to disturb them and simply waste valuable time. But the devotees of the Lord are more kind than the Lord because they understand the purpose of the Lord. Consequently they undertake all kinds of risks, even to the point of approaching ignorant men to try to engage them in the acts of Kṛṣṇa consciousness, which are absolutely necessary for the human being.
🌹 🌹 🌹 🌹 🌹
25 Sept 2019