శ్రీమద్భగవద్గీత - 150: 03వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 150: Chap. 03, Ver. 31


🌹. శ్రీమద్భగవద్గీత -150 / Bhagavad-Gita - 150🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 31 🌴

31. యే యే మతమిదం నిత్యమనుతష్టన్తి మానవా: |
శ్రద్ధావన్తోనసూయన్తో ముచ్యన్తే తేపి కర్మభి: ||


🌷. తాత్పర్యం :

నా అజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడివడగలరు.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుని ఆదేశము వేదజ్ఞానపు సారమై యున్నందున ఎటువంటి మినహాయింపు లేకుండా నిత్యసత్యమై యున్నది. వేదములు నిత్యమైనట్లు కృష్ణభక్తిభావన యందలి ఈ సత్యము కూడా నిత్యమై యున్నది. కనుక శ్రీకృష్ణభగవానుని యెడ అసూయరహితులై ప్రతియొక్కరు ఈ ఆదేశమునందు శ్రద్ధను కలిగియుండవలెను. శ్రీకృష్ణుని యందు శ్రద్దాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములు వ్రాయు తత్త్వవేత్తలు పెక్కురు గలరు. అట్టివారు ఏనాడును కామ్యకర్మబంధము నుండి ముక్తిని పొందజాలరు.

కాని భగవానుని నిత్య ఆజ్ఞలపై సంపూర్ణశ్రద్ధను కలిగియున్న సామన్యవ్యక్తి అట్టి ఆజ్ఞను పాటింప సమర్థుడు కాకపోయినను కర్మబంధము నుండి ముక్తిని పొందగలడు. భగవదాజ్ఞల నన్నింటిని అనుసరించుట కృష్ణభక్తిభావన యందలి ఆరంభస్థితిలో సాధ్యము కాకపోవచ్చును. కాని ఆ నియమము నెడ ద్వేషమును చూపక అపజయము మరియు నిరాశల చింత వీడి మనుజుడు శ్రద్ధతో కర్మనొనరించినిచో నిక్కముగా కృష్ణభక్తిభావనాస్థితికి ఉద్ధరింపబడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 150 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 31 🌴



31. ye me matam idaṁ nityam anutiṣṭhanti mānavāḥ
śraddhāvanto ’nasūyanto mucyante te ’pi karmabhiḥ


🌷 Translation :

Those persons who execute their duties according to My injunctions and who follow this teaching faithfully, without envy, become free from the bondage of fruitive actions.


🌷 Purport :

The injunction of the Supreme Personality of Godhead, Kṛṣṇa, is the essence of all Vedic wisdom and therefore is eternally true without exception. As the Vedas are eternal, so this truth of Kṛṣṇa consciousness is also eternal. One should have firm faith in this injunction, without envying the Lord. There are many philosophers who write comments on the Bhagavad-gītā but have no faith in Kṛṣṇa.

They will never be liberated from the bondage of fruitive action. But an ordinary man with firm faith in the eternal injunctions of the Lord, even though unable to execute such orders, becomes liberated from the bondage of the law of karma. In the beginning of Kṛṣṇa consciousness, one may not fully discharge the injunctions of the Lord, but because one is not resentful of this principle and works sincerely without consideration of defeat and hopelessness, he will surely be promoted to the stage of pure Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


27 Sept 2019