శ్రీమద్భగవద్గీత - 145: 03వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 145: Chap. 03, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 145 / Bhagavad-Gita - 145 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 26 🌴


26. న బుద్ధిభేదం జనయేద జ్ఞానాం కర్మసజ్గినామ్ |
జోష యేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్త: సమాచరన్ ||

🌷. తాత్పర్యం :

విధ్యుక్తధర్మపు ఫలముల యెడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడురీతిగా విద్వాంసుడు వారిని కర్మ యందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తిభావముతో కర్మనొనరించును (కృష్ణభక్తి వృద్ది యగుటకు) వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను.

🌷. భాష్యము :

“వేదైశ్చ సర్వైరహమేవ వేద్య:” సమస్త వేదకర్మల అంతిమ ప్రయోజనమిదియే. వేదములందు తెలుపబడిన సర్వకర్మలు, సర్వయజ్ఞములు (లౌకిక కర్మలకు సంబంధించిన నిర్దేశములతో సహా) ఇతరములైన అన్ని విషయములు జీవితగమ్యమైన శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుట కొరకే ఉద్దేశింప బడియున్నవి. కాని బద్ధజీవులు ఇంద్రియభోగము కన్నను అన్యమైనది ఎరుగనందున అట్టి ప్రయోజనముకే వేదాధ్యయనమును గావింతురు.

అయినను వేదకర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మనుజుడు క్రమముగా కృష్ణభక్తిభావనా స్థాయికి చేరగలడు. కనుకనే కృష్ణభక్తి భావనాయుతుడు ఇతరుల కర్మల యందు లేదా అవగాహన యందు కలతకు కలిగించరాదు. దానికి బదులు ఏ విధముగా కర్మ ఫలమును శ్రీకృష్ణుని సేవకు అంకితము చేయవచ్చునో తెలియ జేయు రీతిలో అతడు కర్మ నొనరింపవలెను. అనగా ఇంద్రియ భోగము కొరకై కర్మనొనరించు అజ్ఞాని వాస్తవమునకు ఏ విధముగా కర్మనొనరించవలెనో మరియు ఏ విధముగా వర్తించవలెనో తెలిసికొనగలిగే రీతిలో కృష్ణభక్తిభావనాయుతుడు వర్తింపవలెను.

అజ్ఞానియైన వానిని వాని కర్మల యందు కలత పెట్టకుండుట సరియైనదే అయినను, కొద్దిగా కృష్ణభక్తిభావన కలిగినవానిని ఇతర వేదప్రక్రియలకై ఎదురు చూడక నేరుగా కృష్ణ సేవ యందు నియుక్తుని చేయవచ్చును. అటువంటి అదృష్టభాగుని వేదవిహిత కర్మల ననుసరింపవలసిన అవసరము ఏదియును లేదు. ఏలయన విధ్యుక్తధర్మ నిర్వాహణము ద్వారా కలుగు ఫలములన్నింటిని మనుజుడు కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలుచుట వలన సాధింపగలుగును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 145 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 26 🌴


26. na buddhi-bhedaṁ janayed ajñānāṁ karma-saṅginām
joṣayet sarva-karmāṇi vidvān yuktaḥ samācaran


🌷Translation :

So as not to disrupt the minds of ignorant men attached to the fruitive results of prescribed duties, a learned person should not induce them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them in all sorts of activities [for the gradual development of Kṛṣṇa consciousness].

🌷 Purport :

Vedaiś ca sarvair aham eva vedyaḥ. That is the end of all Vedic rituals. All rituals, all performances of sacrifices, and everything that is put into the Vedas, including all direction for material activities, are meant for understanding Kṛṣṇa, who is the ultimate goal of life.

But because the conditioned souls do not know anything beyond sense gratification, they study the Vedas to that end. But through fruitive activities and sense gratification regulated by the Vedic rituals one is gradually elevated to Kṛṣṇa consciousness. Therefore a realized soul in Kṛṣṇa consciousness should not disturb others in their activities or understanding, but he should act by showing how the results of all work can be dedicated to the service of Kṛṣṇa.

The learned Kṛṣṇa conscious person may act in such a way that the ignorant person working for sense gratification may learn how to act and how to behave. Although the ignorant man is not to be disturbed in his activities, a slightly developed Kṛṣṇa conscious person may directly be engaged in the service of the Lord without waiting for other Vedic formulas. For this fortunate man there is no need to follow the Vedic rituals, because by direct Kṛṣṇa consciousness one can have all the results one would otherwise derive from following one’s prescribed duties.

🌹 🌹 🌹 🌹 🌹


22 Sept 2019