🌹. శ్రీమద్భగవద్గీత -128 / Bhagavad-Gita - 128 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 9 🌴
యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబన్ధన: |
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసంగ: సమాచార ||
🌷. తాత్పర్యం :
విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతికజగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతీపుత్రా! నీ విధ్యుక్తధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు.
🌷. భాష్యము :
సాధారణమైన దేహపోషణ కొరకైనను ప్రతియొక్కరు కర్మచేయవలసి యున్నందున ఆ ప్రయోజనము సిద్ధించురీతిలోనే వర్ణాశ్రమములకు సంబంధించిన విధ్యుక్తధర్మములు నిర్దేశింపబడినవి. యజ్నమనాగా విష్ణువు లేదా యాగకర్మలు. యాగకర్మలన్నియును విష్ణుప్రీత్యర్థమే నిర్ణియింపబడినవి. “యజ్ఞో వై విష్ణు:” అని వేదములు పలుకుచున్నవి.
అనగా మనుజుడు విదింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణువును ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనము పొందగలడు. అనగా కృష్ణభక్తిరసభావన యనునది ఈ శ్లోకమున తెలిపిన రీతి యజ్ఞమును నిర్వహించుట వంటిది. వర్ణాశ్రమపద్దతి సైతము విష్ణుప్రీతినే లక్ష్యముగా భావించును. “వర్ణాశ్రమాచారవతా పురుషేణ పర: పుమాన్/ విష్ణు: ఆరాధ్యతే” (విష్ణుపురాణము 3.8.8)
కనుక ప్రతియొక్కరు విష్ణుప్రీత్యర్థమే కర్మనొనరింపవలసియున్నది. శుభాశుభకర్మలు రెండును ఫలములను కలిగియుండి కర్తను బంధించు కారణమున ఇతర కర్మలన్నియును జగమునందు బంధమునే కలిగించును. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిభావన యందు కృష్ణుని ( లేదా విష్ణువు) ప్రీత్యర్థమై కర్మనొనరింపవలెను. అటువంటి కర్మలను చేయునపుడు మనుజుద్ ముక్తస్థితి యందే నిలిచియుండును. ఇది కర్మచేయట యందు గొప్ప నేర్పరితనమై యున్నందున నిష్ణాటులైనవారి నిర్దేశము దీనికి తొలుత అవసమై యున్నది.
అనగా శ్రీకృష్ణభాక్తును నిర్దేశమునందు గాని లేదా (ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయునవకాశము కలిగెనో అటువంటి) శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్ష భోధనల ననుసరించి గాని ప్రతియొక్కరు నిపుణతతో వర్తింపవలసియున్నది. దేనిని కూడా ఇంద్రియప్రీతికై నిర్వహింపరాదు. ప్రతిదియును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే నిర్వహింపవలెను. ఇటువంటి అబ్యాసము మనుజుని కర్మఫలము నుండి రక్షించుటయే గాక క్రమముగా భగవానుని ప్రేమయుత సేవా స్థాయికి అతనిని ఉద్ధరించును. దాని ద్వారా అతడు భగవద్ధామమును చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 128 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 9 🌴
9. yajñārthāt karmaṇo ’nyatra loko ’yaṁ karma-bandhanaḥ
tad-arthaṁ karma kaunteya mukta-saṅgaḥ samācara
🌷Translation :
Work done as a sacrifice for Viṣṇu has to be performed; otherwise work causes bondage in this material world. Therefore, O son of Kuntī, perform your prescribed duties for His satisfaction, and in that way you will always remain free from bondage.
🌷 Purport :
Since one has to work even for the simple maintenance of the body, the prescribed duties for a particular social position and quality are so made that that purpose can be fulfilled. Yajña means Lord Viṣṇu, or sacrificial performances. All sacrificial performances also are meant for the satisfaction of Lord Viṣṇu. The Vedas enjoin: yajño vai viṣṇuḥ. In other words, the same purpose is served whether one performs prescribed yajñas or directly serves Lord Viṣṇu.
Kṛṣṇa consciousness is therefore performance of yajña as it is prescribed in this verse. The varṇāśrama institution also aims at satisfying Lord Viṣṇu. Varṇāśramācāravatā puruṣeṇa paraḥ pumān/ viṣṇur ārādhyate (Viṣṇu Purāṇa 3.8.8).
Therefore one has to work for the satisfaction of Viṣṇu. Any other work done in this material world will be a cause of bondage, for both good and evil work have their reactions, and any reaction binds the performer. Therefore, one has to work in Kṛṣṇa consciousness to satisfy Kṛṣṇa (or Viṣṇu); and while performing such activities one is in a liberated stage.
This is the great art of doing work, and in the beginning this process requires very expert guidance. One should therefore act very diligently, under the expert guidance of a devotee of Lord Kṛṣṇa, or under the direct instruction of Lord Kṛṣṇa Himself (under whom Arjuna had the opportunity to work). Nothing should be performed for sense gratification, but everything should be done for the satisfaction of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
5 Sept 2019