🌹. శ్రీమద్భగవద్గీత - 152 / Bhagavad-Gita - 152 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 33 🌴
33. సదృశం చేష్టతే స్వస్యా: ప్రకృతేర్ జ్ఞానవానపి |
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహ: కిం కరిష్యతి ||
🌷. తాత్పర్యం :
జ్ఞానవంతుడైన మనుజుడు సైతము తన గుణముల ననుసరించియే కర్మ నొనరించును. ఏలయన ప్రతియొక్కరు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి యెడ నిగ్రహమేమి చేయగలదు?
🌷. భాష్యము :
సప్తమాధ్యాయమున (7.14) శ్రీకృష్ణుభగవానుడు నిర్ధారించిన రీతి మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిభావన యనెడి అధ్యాత్మికస్థితి యందు నెలకొననిదే భౌతికప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి ముక్తిని పొందలేడు. కావున లౌకికభావనలో గొప్ప విధ్వాంసుడని పెరోందనివానికి సైతము కేవలము సిద్ధాంతమాత్ర జ్ఞానముచే (ఆత్మను దేహమునకు అన్యముగా గాంచుట) మాయబంధము నుండి ముక్తిని పొందుట సాధ్యము కాదు.
జ్ఞానమునందు పురోగతి నొందినవానిగా పైకి ప్రదర్శనము గావించుచు అంతరమున సంపూర్ణముగా గుణములకు లోబడి వాటిని జయింపలేని నామమాత్ర ఆధ్యాత్మికవాదులు పెక్కురు గలరు. మనుజుడు విద్యాజ్ఞానసంపన్నుడైనను చిరకాల భౌతికప్రకృతి సాహచర్యముచే బద్దుడై యుండును. మనుజుడు తన భౌతికస్థితి ననుసరించి వివిధకర్మలలో నియుక్తుడై యున్నను భౌతికబంధము నుండి ముక్తినోన్డుతకు కృష్ణభక్తిరసభావనము సహాయపడగలదు. కావున సంపూర్ణముగా కృష్ణభక్తిభావనాయుతులు కానిదే ఎవ్వరును విధ్యుక్తధర్మములను త్యజింపరాదు.
అనగా విధ్యక్తధర్మములను తొందరపాటుగా త్యజించి నామమాత్ర యోగిగా లేదా కృత్రిమ ఆధ్యాత్మికునిగా నగుటకు ఎవ్వరును యత్నింపరాదు. మనుజుడు తానున్న స్థితి యందే నిలిచి, ఉన్నత శిక్షణలో కృష్ణభక్తిని పొందుటకు యత్నించుట ఉత్తమమైన విధానము. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని మయాబంధము నుండి విడుదలను పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 152 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 33 🌴
33. sadṛśaṁ ceṣṭate svasyāḥ prakṛter jñānavān api
prakṛtiṁ yānti bhūtāni nigrahaḥ kiṁ kariṣyati
🌷 Translation :
Even a man of knowledge acts according to his own nature, for everyone follows the nature he has acquired from the three modes. What can repression accomplish?
🌷 Purport :
Unless one is situated on the transcendental platform of Kṛṣṇa consciousness, he cannot get free from the influence of the modes of material nature, as it is confirmed by the Lord in the Seventh Chapter (7.14).
Therefore, even for the most highly educated person on the mundane plane, it is impossible to get out of the entanglement of māyā simply by theoretical knowledge, or by separating the soul from the body. There are many so-called spiritualists who outwardly pose as advanced in the science but inwardly or privately are completely under particular modes of nature which they are unable to surpass.
Academically, one may be very learned, but because of his long association with material nature, he is in bondage. Kṛṣṇa consciousness helps one to get out of the material entanglement, even though one may be engaged in his prescribed duties in terms of material existence.
Therefore, without being fully in Kṛṣṇa consciousness, one should not give up his occupational duties. No one should suddenly give up his prescribed duties and become a so-called yogī or transcendentalist artificially. It is better to be situated in one’s position and to try to attain Kṛṣṇa consciousness under superior training. Thus one may be freed from the clutches of Kṛṣṇa’s māyā.
🌹 🌹 🌹 🌹 🌹
29 Sept 2019