శ్రీమద్భగవద్గీత - 138: 03వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 138: Chap. 03, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత -138 / Bhagavad-Gita - 138 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 19 🌴

19. తస్మాదసక్త: సతతం కార్యం కర్మ సమాచర |
ఆసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుష: ||

🌷. తాత్పర్యం :

కనుక ప్రతియొక్కరు కర్మఫలముల యందు ఆసక్తిని గొనక తన విధియని భావించుచు కర్మల యందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మ నొనరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు.

🌷. భాష్యము :

భక్తులకు “పరము” అనునది దేవదేవుడైన శ్రీకృష్ణుడు కాగా, నిరాకారవాదికి మోక్షమై యున్నది. కనుక సరియైన నిర్దేశమునందు కర్మఫలము నెడ సంగము లేకుండా కృష్ణుని కొరకై కర్మను చేయువాడు (కృష్ణభక్తిరసభావితుడు) తప్పక జీవితపు పరమలక్ష్యము వైపుకు పురోగమించును. కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణుని కొరకే యుద్ధము చేయుమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణుడు కోరియుండుటయే అందులకు కారణము. సాధువుగా లేదా అహింసాత్మకునిగా వర్తించుట యనునది సంగత్వమును కూడినది. కాని భగవానుని పక్షమున కర్మచేయుట ఫలమునందాసక్తి లేకుండా వర్తించుట వంటిది. పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన అత్యుత్తమ పూర్ణకర్మమదియే.

ఇంద్రియభోగానుభవమునందు ఒనర్చబడు పాపకర్మలను శుద్ధిపరచుట కొరకే యజ్ఞముల వంటి వేదవిహితకర్మలు నిర్వహింపబడును. కాని కృష్ణభక్తి యందలి కర్మలు శుభాశుభకర్మఫలములకు అతీతములై యున్నవి. కృష్ణభక్తుడైనవాడు కర్మఫలములందు ఆసక్తుడు గాక, కేవలము కృష్ణుని తరపున కర్మను సాగించును. అతడు అన్నిరకముల కార్యములను నిర్వహించినను సంపూర్ణముగా అసంగుడై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 138 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 19 🌴

19. tasmād asaktaḥ satataṁ kāryaṁ karma samācara
asakto hy ācaran karma param āpnoti pūruṣaḥ


🌷Translation :

Therefore, without being attached to the fruits of activities, one should act as a matter of duty, for by working without attachment one attains the Supreme.

🌷 Purport :

The Supreme is the Personality of Godhead for the devotees, and liberation for the impersonalist. A person, therefore, acting for Kṛṣṇa, or in Kṛṣṇa consciousness, under proper guidance and without attachment to the result of the work, is certainly making progress toward the supreme goal of life.

Arjuna is told that he should fight in the Battle of Kurukṣetra for the interest of Kṛṣṇa because Kṛṣṇa wanted him to fight. To be a good man or a nonviolent man is a personal attachment, but to act on behalf of the Supreme is to act without attachment for the result. That is perfect action of the highest degree, recommended by the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa.

Vedic rituals, like prescribed sacrifices, are performed for purification of impious activities that were performed in the field of sense gratification. But action in Kṛṣṇa consciousness is transcendental to the reactions of good or evil work. A Kṛṣṇa conscious person has no attachment for the result but acts on behalf of Kṛṣṇa alone. He engages in all kinds of activities, but is completely nonattached.

🌹 🌹 🌹 🌹 🌹


15 Sept 2019