శ్రీమద్భగవద్గీత - 149: 03వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 149: Chap. 03, Ver. 30
🌹. శ్రీమద్భగవద్గీత - 149 / Bhagavad-Gita - 149 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 30 🌴
30. మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యా ధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర: ||
🌷. తాత్పర్యం :
కావున ఓ అర్జునా! నన్ను గూర్చిన సంపూర్ణజ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి, కర్మలనన్నింటిని నాకు అర్పించి మాంద్యమునకు వీడి యుద్ధము చేయుము.
🌷. భాష్యము :
శ్రీమద్భగవద్గీత యొక్క ప్రయోజనము ఈ శ్లోకము స్పష్టముగా తెలియజేయుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె విధ్యుక్తధర్మములను నిర్వహించుటకు ప్రతియొక్కరు సంపూర్ణ కృష్ణభక్తిరసభావితులు కావలసియున్నదని శ్రీకృష్ణభగవానుడు భోధించుచున్నాడు. అటువంటి ఉత్తరువు విషయమును కొంత కష్టతరము కావించినను కృష్ణునిపై ఆధారపడి కర్మలను నిర్వహింపవలసియే యున్నది. ఏలయన అదియే జీవుని నిజస్థితియై యున్నది.
జీవుని నిత్యమైన సహజస్థితి భగవానుని కోరికలకు లోబడియుండుట కావున అతడెన్నడును భగవానుని సహాయము లేకుండా స్వతంత్రునిగా ఆనదము ననుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుని మాదిరిగా శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతియొక్కరు భగవానుని అనుగ్రహము కొరకు సర్వమును త్యాగము చేయుటయే గాక విధ్యుక్తధర్మములను సైతము ఎటువంటి యజమానిత్వము లేకుండా నిర్వహింప వలసి యున్నది.
అర్జునుడు ఇచ్చట భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింప నవసరము లేదు. కేవలము దాని అమలు పరచిన చాలును. శ్రీకృష్ణభగవానుడు సర్వాత్మలకు అత్మయైనవాడు. కనుక స్వంతభావన ఏమాత్రము లేకుండా ఆ పరమపురుషును పైననే సంపూర్ణముగా ఆధారపడెడివాడు (అనగా కృష్ణభక్తిరస భావితుడు) “ఆధ్యాతిమిక చేతనుడు” అని పిలువబడును. “నిరాశీ:” అనగా ప్రభువు ఆజ్ఞమేరకు వర్తించుచు, కర్మఫలములను కోరనివాడని భావము. కృష్ణభక్తిభావన యందు పనిచేయువాడు నిక్కముగా దేనిపైనను మమత్వమును చూపడు. అట్టి భావనయే “నిర్మమత్వభావనము”(ఏదియును నాదికాదు) అనబడును.
నామమాత్ర బందువుల యెడ గల బంధుత్వ కారణమున అట్టి కటిన ఉత్తరువును పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని శీఘ్రమే త్యజించవలెను. ఆ విధముననే మనుజుడు “విగతజ్వరుడు” (అలసత్వము లేనివాడు) కాగలడు. ప్రతి యొక్కడు తన గుణము మరియు స్థితి ననుసరించి ఒక ప్రత్యేకమైన కర్మనొనరింప వలసియుండును. పైన తెలిపిన విధముగా అట్టి విధ్యుక్తధర్మములను కృష్ణభక్తిభావనలో నిర్వహింపవలెను. అది మనుజుని ముక్తి పథమునకు నడిపించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 149 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 30 🌴
30. mayi sarvāṇi karmāṇi sannyasyādhyātma-cetasā
nirāśīr nirmamo bhūtvā yudhyasva vigata-jvaraḥ
🌷 Translation :
Therefore, O Arjuna, surrendering all your works unto Me, with full knowledge of Me, without desires for profit, with no claims to proprietorship, and free from lethargy, fight.
🌷 Purport :
This verse clearly indicates the purpose of the Bhagavad-gītā. The Lord instructs that one has to become fully Kṛṣṇa conscious to discharge duties, as if in military discipline. Such an injunction may make things a little difficult; nevertheless duties must be carried out, with dependence on Kṛṣṇa, because that is the constitutional position of the living entity. The living entity cannot be happy independent of the cooperation of the Supreme Lord, because the eternal constitutional position of the living entity is to become subordinate to the desires of the Lord. Arjuna was therefore ordered by Śrī Kṛṣṇa to fight as if the Lord were his military commander.
One has to sacrifice everything for the good will of the Supreme Lord, and at the same time discharge prescribed duties without claiming proprietorship. Arjuna did not have to consider the order of the Lord; he had only to execute His order. The Supreme Lord is the soul of all souls; therefore, one who depends solely and wholly on the Supreme Soul without personal consideration.
This consciousness is called nirmama, or “nothing is mine.” And if there is any reluctance to execute such a stern order, which is without consideration of so-called kinsmen in the bodily relationship, that reluctance should be thrown off; in this way one may become vigata-jvara, or without feverish mentality or lethargy. Everyone, according to his quality and position, has a particular type of work to discharge, and all such duties may be discharged in Kṛṣṇa consciousness, as described above. That will lead one to the path of liberation.
🌹 🌹 🌹 🌹 🌹
26 Sept 2019