శ్రీమద్భగవద్గీత - 134: 03వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 134: Chap. 03, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 134 / Bhagavad-Gita - 134 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 15 🌴

15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్ ||

🌷. తాత్పర్యం :

నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపపడగా, అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్టితమై యుండును.

🌷. భాష్యము :

కేవలము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మనొనరింపవలసిన అవసరము (యజ్ఞార్థకర్మ) ఈ శ్లోకమునందు మరింత నొక్కి చెప్పబడినది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మ చేయవలెనన్నచో కర్మకు సంబంధించిన మార్గదర్శకత్వమును బ్రహ్మమునందే పొందవలెను. కనుకనే వేదములు కర్మనొనరించుటకు మార్గదర్శక సూత్రములై యున్నవి. వేదనిర్దేశము లేకుండా ఒనరింపబడెడి కర్మము వికర్మగా(అప్రమాణికకర్మ) లేదా పాపకర్మగా తెలియబడును. కనుక కర్మఫలము నుండి రక్షింపబడుటకు ప్రతియొక్కరు వేదముల నుండి మార్గదర్శకత్వమును పొందవలెను.

సాధారణ జీవతమున మనుజుడు దేశము యొక్క రాజ్యంగ నిర్దేశము నందు పనిచేయు రీతి ప్రతి యెక్కరును భగవానుని నిర్దేశములోనే కర్మ నొనరించవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు ప్రత్యక్షముగా అతని శ్వాస ద్వారా ప్రకటనమై యున్నవి. అస్య మహతో భూతస్య నిశ్యసితమేతత్ యద్ ఋగ్వేదో యజుర్వేద: సామవేదో(థర్వాంగిరస: -ఋగ్బేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదమనెడి నాలుగు వేదములు దేవదేవుని శ్వాస నుండి బహిర్గతమైనవి (బృహదారాణ్యకోపనిషత్తు 4.5.11).

భగవానుడు సర్వశక్తిసమన్వితుడు కావున శ్వాస ద్వారాను భాషించగలడు. శ్రీకృష్ణభగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతరేంద్రియ కార్యములను సైతము చేయగలిగిన శక్తిసామర్థ్యములు కలిగియున్నాడని తెలుపుచు బ్రహ్మసంహిత ఈ విషయమును నిర్దారించచున్నది. అనగా భగవానుడు శ్వాస ద్వారాను మాట్లాడగలడు. కన్నుల ద్వారాను సృజింపగలడు. వాస్తవమునకు అతడు ప్రకృతిని వీక్షించుట ద్వారానే జీవులను సృష్టించెనని తెలుపబడినది. బద్ధజీవులను ఆ విధముగా ప్రకృతి గర్భమున సృజించిన పిమ్మట వారు ఏ విధముగా తరిగి తన ధామమును చేరగలరో తెలుపుటకు అతడు వేదవిజ్ఞానమునందు నిర్దేశములు నొసగెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 134 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 15 🌴

15. karma brahmodbhavaṁ viddhi brahmākṣara-samudbhavam
tasmāt sarva-gataṁ brahma nityaṁ yajñe pratiṣṭhitam

🌷Translation :

Regulated activities are prescribed in the Vedas, and the Vedas are directly manifested from the Supreme Personality of Godhead. Consequently the all-pervading Transcendence is eternally situated in acts of sacrifice.

🌷 Purport :

Yajñārtha-karma, or the necessity of work for the satisfaction of Kṛṣṇa only, is more expressly stated in this verse. If we have to work for the satisfaction of the yajña-puruṣa, Viṣṇu, then we must find out the direction of work in Brahman, or the transcendental Vedas. The Vedas are therefore codes of working directions.

Anything performed without the direction of the Vedas is called vikarma, or unauthorized or sinful work. Therefore, one should always take direction from the Vedas to be saved from the reaction of work. As one has to work in ordinary life by the direction of the state, one similarly has to work under direction of the supreme state of the Lord.

Such directions in the Vedas are directly manifested from the breathing of the Supreme Personality of Godhead. It is said, asya mahato bhūtasya niśvasitam etad yad ṛg-vedo yajur-vedaḥ sāma-vedo ’tharvāṅgirasaḥ. “The four Vedas – namely the Ṛg Veda, Yajur Veda, Sāma Veda and Atharva Veda – are all emanations from the breathing of the great Personality of Godhead.” (Bṛhad-āraṇyaka Upaniṣad 4.5.11)

🌹 🌹 🌹 🌹 🌹


11 Sept 2019