శ్రీమద్భగవద్గీత - 131: 03వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 131: Chap. 03, Ver. 12
🌹. శ్రీమద్భగవద్గీత -131 / Bhagavad-Gita - 131 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 12 🌴
12. ఇష్టాన్ భోగాన్ హి దేవా దాస్యన్తే యజ్ఞభావితా: |
తైర్దాత్తానప్రదాయైభ్యో యో భుజ్ఞ్కే స్తేన ఏవ స: ||
🌷. తాత్పర్యం :
వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నియును ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును.
🌷. భాష్యము :
దేవదేవుడైన విష్ణువు తరపున జీవితావష్యకములైనవాటిని సమకూర్చుటకు అధీకృతులైనట్టివారే దేవతలు. కావున వారిని విధిపూర్వకమగు యజ్ఞముచే సంతృప్తిపరుపవలెను. వేదములందు పలుదేవతల కొరకు పలువిధములైన యజ్ఞములు తెలుపబడినను అవియన్నియును అంత్యమున దేవదేవునకే అర్పింపబడును. శ్రీకృష్ణభగవానుని గూర్చి తెలియనివానికే దేవతాయజ్ఞము ఆదేశించబడినది.
మనుజుని వివిధ గుణములు ననుసరించి వివిధ యజ్ఞములు వేదము లందు ప్రతిపాదింప బడినవి. వివిధ దేవతార్చనములు కూడా అదే విధముగా గుణముల ననుసరించియే తెలుపబడినవి. ఉదాహరణమునకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క ఘోరరూపమైన కాళికాదేవి పూజా ఆదేశింపబడినది. ఆ దేవత యెదుట పశుబలియు తెలుపబడినది.
కాని సత్వగుణములో నున్నవారికి మాత్రము విష్ణుభగవానుని దివ్యారచనము ఉద్దేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మికస్థితిని పొందుటకే ఈ యజ్ఞములన్నియును ఉన్నవి. పంచమాహా యజ్ఞములని తెలియబడు ఐదు యజ్ఞములు మాత్రము సాధారణజనులకు అత్యంత అవశ్యకములై యున్నవి.
అయినను మానవులకు అవసరమైనట్టి జీవనావశ్యకములన్నియు శ్రీకృష్ణభగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతియొక్కరు ఎరుగవలెను. ఎవ్వరును వాటిని సృష్టింపలేరు. జీవితావసరములైన ఉష్ణము, కాంతి, నీరు, వాయువు వంటివి కూడా మానవునిచే సృష్టింపబడలేదు. శ్రీకృష్ణభగవానుడు లేనిదే సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, గాలి వంటివి కలుగవు. అవి లేనిదే ఎవ్వరును జీవింపలేరు.
అనగా మన జీవితము ఆ భగవానుడు కరుణతో సమకూర్చువాని పైననే ఆధారపడియున్నది. అవియన్నియును దేవతలచే ఒసగబడుచున్నవి. లభించిన వానిని సద్వినియోగ పరచుకొని ఆనందముతో ఆరోగ్యవంతులై, అత్మానుభవమును గూర్చి చింతించు జీవితలక్ష్యమైన జీవనసంఘర్షణ నుండి ముక్తిని సాధింతురనెడి ఉద్దేశ్యము చేతనే వారట్లు మనకు సర్వమును ఒసగుచున్నారు. అట్టి జీవితలక్ష్యము యజ్ఞనిర్వాహణచే సిద్ధించుచున్నది.
కాని మానవజన్మ లక్ష్యమును మరచి, భగవానుని ప్రతినిదులచే ఒసగబడినవాటిని కేవలము ఇంద్రియప్రీతి కొరకే వినియోగించి భౌతికత్వమునందే మరింతగా బద్ధులమైనచో (అది సృష్టిప్రయోజనమెన్నడును కాదు) మనము చోరులుగా పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడుడుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 131 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 12 🌴
12. iṣṭān bhogān hi vo devā dāsyante yajña-bhāvitāḥ
tair dattān apradāyaibhyo yo bhuṅkte stena eva saḥ
🌷Translation :
In charge of the various necessities of life, the demigods, being satisfied by the performance of yajña [sacrifice], will supply all necessities to you. But he who enjoys such gifts without offering them to the demigods in return is certainly a thief.
🌷 Purport :
The demigods are authorized supplying agents on behalf of the Supreme Personality of Godhead, Viṣṇu. Therefore, they must be satisfied by the performance of prescribed yajñas. In the Vedas, there are different kinds of yajñas prescribed for different kinds of demigods, but all are ultimately offered to the Supreme Personality of Godhead. For one who cannot understand what the Personality of Godhead is, sacrifice to the demigods is recommended.
According to the different material qualities of the persons concerned, different types of yajñas are recommended in the Vedas. Worship of different demigods is also on the same basis – namely, according to different qualities. For example, the meat-eaters are recommended to worship the goddess Kālī, the ghastly form of material nature, and before the goddess the sacrifice of animals is recommended. But for those who are in the mode of goodness, the transcendental worship of Viṣṇu is recommended.
But ultimately all yajñas are meant for gradual promotion to the transcendental position. For ordinary men, at least five yajñas, known as pañca-mahā-yajña, are necessary.
🌹 🌹 🌹 🌹 🌹
8 Sept 2019