శ్రీమద్భగవద్గీత - 151: 03వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 151: Chap. 03, Ver. 32


🌹. శ్రీమద్భగవద్గీత - 151 / Bhagavad-Gita - 151 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 32 🌴

32. యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్టన్తి మే మతమ్ |
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతస: ||


🌷. తాత్పర్యం :

కాని అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపని వారలు జ్ఞానరహితులుగను, మూడులుగను, పూర్ణత్వమును పొందు యత్నములో నాశము నొందినవారిగను భావింప బడుదురు.


🌷. భాష్యము :

కృష్ణభక్తిభావనను పొందకపోవుట యందలి దోషము ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అత్యున్నత అధికారి ఆజ్ఞ యెడ అవిధేయతకు శిక్ష తప్పనిసరియైనట్లు,దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞ యెడ అవిధేయతకు సైతము శిక్ష తప్పనిసరిగా లభించును. అట్టి అవిధేయుడు ఎంతటి గొప్పవాడైనను తన రిక్త హృదయము కారణముగా తనను గూర్చి మరియు పరబ్రహ్మము, పరమాత్మ, భగవానులను గూర్చు జ్ఞానరహితుడై యుండును. కావున అతడు జీవనపూర్ణత్వమును పొందుటకు అవకాశమే ఉండదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 151 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 32 🌴


32. ye tv etad abhyasūyanto nānutiṣṭhanti me matam
sarva-jñāna-vimūḍhāṁs tān viddhi naṣṭān acetasaḥ


🌷 Translation :

But those who, out of envy, disregard these teachings and do not follow them regularly are to be considered bereft of all knowledge, befooled, and ruined in their endeavors for perfection.


🌷 Purport :

The flaw of not being Kṛṣṇa conscious is clearly stated herein. As there is punishment for disobedience to the order of the supreme executive head, so there is certainly punishment for disobedience to the order of the Supreme Personality of Godhead. A disobedient person, however great he may be, is ignorant of his own self, and of the Supreme Brahman, Paramātmā and the Personality of Godhead, due to a vacant heart. Therefore there is no hope of perfection of life for him.

🌹 🌹 🌹 🌹 🌹


28 Sept 2019