శ్రీమద్భగవద్గీత - 142: 03వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 142: Chap. 03, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత -142 / Bhagavad-Gita - 142 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 23 🌴

23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రిత: |
మమ వర్త్మానువర్తన్తే మనుష్యా: పార్థ సర్వశ: ||

🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ఒకవేళ నేను విధ్యుక్తధర్మమములను శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు.

🌷. భాష్యము :

ఆధ్యాత్మికపురోగతికి కారకమగు సాంఘికజీవన శాంతిని నెలకొల్పుటకై ప్రతినాగరిక మనుజునకు కొన్ని వంశాచారములు నిర్ణయింపబడినవి. కాని అట్టి నియమనిబంధనలు బద్ధజీవునకే గాని శ్రీకృష్ణునకు కావు.

అయినను తానూ ధర్మసంస్థాపనకై అవతరించి యున్నందున శ్రీకృష్ణుడు ఆ విహితకర్మలు అనుసరించెను లేనిచో సామాన్యజనులు పరమప్రామాణికుడైన శ్రీకృష్ణునే అనుసరింపగలరు. గృహస్థునకు అవసరమైన ధార్మికకర్మలను గృహమునందు మరియు గృహము వెలుపల శ్రీకృష్ణుడు నిర్వహించెనని శ్రీమద్భాగవతము ద్వారా అవగతమగుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 142 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 3 - Karma Yoga - 23 🌴

23. yadi hy ahaṁ na varteyaṁ jātu karmaṇy atandritaḥ
mama vartmānuvartante manuṣyāḥ pārtha sarvaśaḥ


🌷Translation :

For if I ever failed to engage in carefully performing prescribed duties, O Pārtha, certainly all men would follow My path.


🌷 Purport :

In order to keep the balance of social tranquillity for progress in spiritual life, there are traditional family usages meant for every civilized man. Although such rules and regulations are for the conditioned souls and not Lord Kṛṣṇa, because He descended to establish the principles of religion He followed the prescribed rules.

Otherwise, common men would follow in His footsteps, because He is the greatest authority. From the Śrīmad-Bhāgavatam it is understood that Lord Kṛṣṇa was performing all the religious duties at home and out of home, as required of a householder.

🌹 🌹 🌹 🌹 🌹


19 Sept 2019