శ్రీమద్భగవద్గీత - 139: 03వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 139: Chap. 03, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత -139 / Bhagavad-Gita - 139 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 20 🌴

20. కర్మనైవ హి ససిద్ధిమాస్థితా జనకాదయ: |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ||


🌷. తాత్పర్యం :

జనక మహారాజు వంటి రాజులు కేవలము విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున జనసామాన్యమునకు భోదించు నిమిత్తమై తప్పక నీవు కర్మను చేయుము.


🌷. భాష్యము :

జనకుడు వంటి రాజులు ఆత్మానుభవము పొందిన మహాత్ములైనందున వేదనిర్దేశములైన కర్మల నొనరింపవలసిన అవసరము వారికి లేకుండెను. అయినను సామాన్యజనులకు ఆదర్శమును నెలకొల్పుటకై వారు తమ విధ్యుక్తధర్మములను సంపూర్ణముగా నిర్వర్తించిరి. జనకమహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు. భగవద్బక్తుడైనందున అతడు ఉన్నత ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియున్నను మిథిలానగరమునకు (బీహారురాష్టమునకు) రాజైన కారణమున విధ్యుక్తధర్మములను ఏ విధముగా నిర్వర్తింపవలెనో తన ప్రజలకు స్వయముగా తెలియజేయవలసివచ్చెను.

శ్రీకృష్ణునకు మరియు అతని నిత్యస్నేహితుడైన అర్జునునకు విఫలమైన చోట హింస తప్పనిసరి యని జనులకు తెలియజేయుటకై వారు యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధమునకు పూర్వము యుద్ధమును నివారించుటకు సర్వవిధములైన ప్రయత్నములు జరిగెను. స్వయము శ్రీకృష్ణభగవానుడు అందులకు యత్నించినను ఎదుటి పక్షమువారు యుద్ధమునకే సిద్ధపడిరి. కనుక న్యాయసమ్మతమైన అట్టి విషయమున యుద్ధము తప్పనిసరి అయ్యెను.

కృష్ణభక్తిరసభావితుడు ఈ లోకము నెడ ఆసక్తిరహితుడైనను జనులు ఏ విధముగా జీవించవలెనో మరియు కర్మలు ఏ విధముగా ఒనరించవలెనో తెలియజేయుటకై కర్మల నొనరించుచుండును. కృష్ణభక్తిభావన యందు అనుభవజ్ఞులైనవారు ఇతరులు తమను అనుసరించురీతిలో కర్మను సమర్థవంటముగా ఒనరింపగలరు. ఈ విషయమును రాబోవు శ్లోకమునందు వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 139 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 20 🌴

20. karmaṇaiva hi saṁsiddhim āsthitā janakādayaḥ
loka-saṅgraham evāpi sampaśyan kartum arhasi


🌷Translation :

Kings such as Janaka attained perfection solely by performance of prescribed duties. Therefore, just for the sake of educating the people in general, you should perform your work.


🌷 Purport :

Kings like Janaka were all self-realized souls; consequently they had no obligation to perform the prescribed duties in the Vedas. Nonetheless they performed all prescribed activities just to set examples for the people in general. Janaka was the father of Sītā and father-in-law of Lord Śrī Rāma. Being a great devotee of the Lord, he was transcendentally situated, but because he was the king of Mithilā (a subdivision of Bihar province in India), he had to teach his subjects how to perform prescribed duties. Lord Kṛṣṇa and Arjuna, the Lord’s eternal friend, had no need to fight in the Battle of Kurukṣetra, but they fought to teach people in general that violence is also necessary in a situation where good arguments fail.

Before the Battle of Kurukṣetra, every effort was made to avoid the war, even by the Supreme Personality of Godhead, but the other party was determined to fight. So for such a right cause, there is a necessity for fighting. Although one who is situated in Kṛṣṇa consciousness may not have any interest in the world, he still works to teach the public how to live and how to act. Experienced persons in Kṛṣṇa consciousness can act in such a way that others will follow, and this is explained in the following verse.

🌹 🌹 🌹 🌹 🌹


16 Sept 2019