🌹. శ్రీమద్భగవద్గీత -132 / Bhagavad-Gita - 132 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము -13 🌴
13. యజ్ఞశిష్టాన: సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషై: |
భుంజతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్ ||
🌷. తాత్పర్యం :
యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవధ్భక్తులు సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసికొనువారు కేవలము పాపమునే భుజింతురు.
🌷. భాష్యము :
భగవద్భక్తులు లేదాలేదా కృష్ణభక్తిరసభావితులు సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మసంహితలో(5.38) తెలుపబడిన రీతి వారు సదా శ్రీకృష్ణభగవానుని ప్రేమ యందే నిలిచియుందురు (ప్రేమాంజనచ్చురిత భక్తివిలో చనేన సన్త: సదైవ హృదయేషు విలోకయన్తి). దేవదేవుని (ప్రియము నొసగు గోవిందును లేదా ముక్తినొసగు ముకుందుని లేదా సర్వాకర్షకుడైన శ్రీకృష్ణుని) ప్రేమలో సన్నిహితముగా ముడివడియుండుటచే అతనికి తొలుత అర్పింపనిదే దేనిని వారు స్వీకరింపరు.
అనగా అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణోస్మరణము. అర్చనము వంటి పలు భక్తిమార్గములు ద్వారా యజ్ఞములు సదా నిర్వహించుచునే యుందురు. అట్టి యజ్ఞనిర్వాణములు వారిని సదా భౌతికజగమునందలి సర్వవిధ పాపసంగము నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే ఆహారమును తయారు చేసికొనువారు కేవలము చోరులే గాక సర్వవిధములైన పాపములను భుజించినవారు కాగలరు.
దొంగ మరియు పాపియైన మనుజుడు ఎట్లు ఆనందమును పొందగలడు? అదియెన్నడును సాధ్యము కాదు. కనుకనే జనులు సర్వవిధములుగా ఆనందమయులగుటకు సులభమైన ఈ సంకీర్తనా విధానమును నిర్వహించుటను (పూర్ణకృష్ణభక్తిభావనలో) వారికి నేర్చవలసియున్నది. లేనిచో ప్రపంచమునందు సుఖముగాని, శాంతిగాని నెలకొనజాలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 132 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga -13 🌴
13. yajña-śiṣṭāśinaḥ santo mucyante sarva-kilbiṣaiḥ
bhuñjate te tv aghaṁ pāpā ye pacanty ātma-kāraṇāt
🌷Translation :
The devotees of the Lord are released from all kinds of sins because they eat food which is offered first for sacrifice. Others, who prepare food for personal sense enjoyment, verily eat only sin.
🌷 Purport :
The devotees of the Supreme Lord, or the persons who are in Kṛṣṇa consciousness, are called santas, and they are always in love with the Lord as it is described in the Brahma-saṁhitā (5.38): premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti.
The santas, being always in a compact of love with the Supreme Personality of Godhead, Govinda (the giver of all pleasures), or Mukunda (the giver of liberation), or Kṛṣṇa (the all-attractive person), cannot accept anything without first offering it to the Supreme Person. Therefore, such devotees always perform yajñas in different modes of devotional service, such as śravaṇam, kīrtanam, smaraṇam, arcanam, etc., and these performances of yajñas keep them always aloof from all kinds of contamination of sinful association in the material world.
Others, who prepare food for self or sense gratification, are not only thieves but also the eaters of all kinds of sins. How can a person be happy if he is both a thief and sinful? It is not possible. Therefore, in order for people to become happy in all respects, they must be taught to perform the easy process of saṅkīrtana-yajña, in full Kṛṣṇa consciousness. Otherwise, there can be no peace or happiness in the world.
🌹 🌹 🌹 🌹 🌹
9 Sept 2019