శ్రీమద్భగవద్గీత - 136: 03వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 136: Chap. 03, Ver. 17


*🌹. శ్రీమద్భగవద్గీత -136 / Bhagavad-Gita - 136 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 17 🌴*

*17. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మాతృప్తశ్చ మానవ: |*
*ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ||*

🌷. తాత్పర్యం :
*కాని ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మ యందే ఆనందమును గొనుచు, ఆత్మ యందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందినవానికి చేయవలసిన కర్మమేమియును లేదు.*

🌷. భాష్యము :
పూర్ణముగా కృష్ణభక్తిభావనాయుతుడై కృష్ణపరకర్మలచే పూర్ణతృప్తి నొందినవానికి చేయవలసిన కర్మమేమియును ఉండదు. కృష్ణభక్తిభావితుడై కారణమున వేలాది యజ్ఞనిర్వహణ ప్రభావమైన కల్మషమార్జనము అతని యందు శీఘ్రమే కలుగుచున్నది. చైతన్యము ఆ విధముగా శుద్ధిపడినపుడు మనుజుడు తనకు శ్రీకృష్ణభగవానునితో గల సంబంధమును స్థిరముగా ఎరుగవలయును. 

అట్టివానికి విధ్యుక్తధర్మము స్వయముగా భగవానుని కరుణచే హృదయమునందు ప్రకాశితమగును. కనుక వేదంనిర్దేశములను అనుసరింపవలసిన నిర్భంధము అతనికి ఏమాత్రము ఉండదు. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు ఎటువంటి లౌకికకర్మల యందును మగ్నుడు కాడు. అంతియేగాక అతడు మదిర, మగువ వంటి మోహపూర్వక విషయములందు ఏమాత్రము ఆనందమును గొనడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 136 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 17 🌴*

*17. yas tv ātma-ratir eva syād ātma-tṛptaś ca mānavaḥ*
*ātmany eva ca santuṣṭas tasya kāryaṁ na vidyate*

🌷Translation :
*But for one who takes pleasure in the Self, whose human life is one of self-realization, and who is satisfied in the Self only, fully satiated – for him there is no duty.*

🌷 Purport :
A person who is fully Kṛṣṇa conscious, and is fully satisfied by his acts in Kṛṣṇa consciousness, no longer has any duty to perform. Due to his being Kṛṣṇa conscious, all impiety within is instantly cleansed, an effect of many, many thousands of yajña performances. 

By such clearing of consciousness, one becomes fully confident of his eternal position in relationship with the Supreme. His duty thus becomes self-illuminated by the grace of the Lord, and therefore he no longer has any obligations to the Vedic injunctions. Such a Kṛṣṇa conscious person is no longer interested in material activities and no longer takes pleasure in material arrangements like wine, women and similar infatuations.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/