శ్రీమద్భగవద్గీత - 124: 03వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 124: Chap. 03, Ver. 05
🌹. శ్రీమద్భగవద్గీత - 124 / Bhagavad-Gita - 124 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 5 🌴
5. న హి కశ్చిత్ క్షణమపి
జాతు తిష్టత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశ: కర్మ
సర్వ: ప్రకృతిజైర్గుణై: ||
🌷. తాత్పర్యం :
ప్రతిమానవుడు భౌతికప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననుసరించి అవశుడై కర్మ యందు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండ క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు.
🌷. భాష్యము :
సర్వదా చైతన్యముతో కూడియుండుట యనునది దేహమునకు సంబంధించినది కాక ఆత్మ యొక్క లక్షణమై యున్నది. ఆత్మ లేనిదే భౌతికదేహము కొద్దిగానైనను కదలదు. అనగా దేహము కేవలము ఒక చైతన్యరహితమైన వాహనము వంటిది. నిత్యక్రియాశీలకమై క్షణకాలమును జడత్వమును కలిగియుండని ఆత్మ యొక్క ఉనికి వలననే అది పనిచేయగలదు.
వాస్తవమునకు ఆత్మను కృష్ణభక్తిరసభావిత కర్మ యందే నియుక్తము కావింపవలెను. లేనిచో అది మాయాశక్తి నిర్దేశములైన కర్మలలో నియుక్తము కాగలదు. భౌతికశక్తి సంపర్కమునందే ఆత్మ భౌతికగుణమును పొందుచున్నది. అట్టి గుణసంపర్కము నుండి ఆత్మను శుద్ధిపరచుట శాస్త్రములందు తెలుపబడిన విధ్యుక్తధర్మములను విధిగా నిర్వర్తింపవలసియున్నది. కాని ఆత్మ దాని నిజకర్మయైన కృష్ణభక్తిలో నియుక్తమైనప్పుడు అది ఏది చేయగలిగినను లాభదాయకమే కాగలదు. శ్రీమద్భాగవతము(1.5.17) ఈ విషయముననే ద్రువీకరించుచున్నది.
త్యక్త్వా స్వధర్మం చరణామ్బుజం హరేర్బజన్నపక్వో(థపతేత్తతో యది |
యత్ర క్వ వాభద్రమభూదముష్య కిం కో వార్థ ఆప్తో(భజతాం స్వదర్మతః ||
“ఎవరేని కృష్ణభక్తిభావనము స్వీకరించినచో శాస్త్రవిహిత కర్మలను పాటింపకున్నను, భక్తియుతసేవను సక్రమముగా నిర్వర్తింపకున్నను, తన స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టమును గానీం పాపమును గాని పొందడు. అట్లుగాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణకర్మలను నిర్వహించినను కృష్ణభక్తిభావనాపూర్ణుడు కానిచో ఏమి లాభమును పొందగలడు?”
అనగా కృష్ణభక్తిభావనాస్థితికి చేరుట పవిత్రీకరణవిధానము అవసరమై యున్నది. కావున సన్న్యాసము లేదా ఏ పవిత్రీకరణవిధానమైనను తుదిలక్షమైన కృష్ణభక్తిభావనను పొందుటకు సహాయభూతము మాత్రమే. అతి కృష్ణభక్తి ప్రాప్తించినచో సమస్తము నిష్పలమే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 124 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 5 🌴
5. na hi kaścit kṣaṇam api jātu tiṣṭhaty akarma-kṛt
kāryate hy avaśaḥ karma sarvaḥ prakṛti-jair guṇaiḥ
🌷Translation :
Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature; therefore no one can refrain from doing something, not even for a moment.
🌷 Purport :
It is not a question of embodied life, but it is the nature of the soul to be always active. Without the presence of the spirit soul, the material body cannot move. The body is only a dead vehicle to be worked by the spirit soul, which is always active and cannot stop even for a moment. As such, the spirit soul has to be engaged in the good work of Kṛṣṇa consciousness, otherwise it will be engaged in occupations dictated by the illusory energy.
In contact with material energy, the spirit soul acquires material modes, and to purify the soul from such affinities it is necessary to engage in the prescribed duties enjoined in the śāstras. But if the soul is engaged in his natural function of Kṛṣṇa consciousness, whatever he is able to do is good for him. The Śrīmad-Bhāgavatam (1.5.17) affirms this:
tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer
bhajann apakvo ’tha patet tato yadi
yatra kva vābhadram abhūd amuṣya kiṁ
ko vārtha āpto ’bhajatāṁ sva-dharmataḥ
“If someone takes to Kṛṣṇa consciousness, even though he may not follow the prescribed duties in the śāstras or execute the devotional service properly, and even though he may fall down from the standard, there is no loss or evil for him. But if he carries out all the injunctions for purification in the śāstras, what does it avail him if he is not Kṛṣṇa conscious?”
So the purificatory process is necessary for reaching this point of Kṛṣṇa consciousness. Therefore, sannyāsa, or any purificatory process, is to help reach the ultimate goal of becoming Kṛṣṇa conscious, without which everything is considered a failure.
🌹 🌹 🌹 🌹 🌹
1 Sept 2019