శ్రీమద్భగవద్గీత - 130: 03వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 130: Chap. 03, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 130 / Bhagavad-Gita - 130 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 11 🌴

దేవాన్ భావయతే తే దేవా భావయస్తు వ: |
పరస్పరం భావయన్త: శ్రేయ: పరమవాప్స్యథ ||

🌷. తాత్పర్యం :

యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు.

🌷. భాష్యము :

లోకకార్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు. జీవుల దేహపోషనార్థమై కావలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరముల నన్నింటిని ఒసగు కార్యము అట్టి దేవతలకు అప్పగించబడినది. అసంఖ్యాకములుగా నున్న అట్టి దేవతలు దేవదేవుడైన శ్రీకృష్ణుని శరీరము నందలి భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులనునవి మానవుల యజ్ఞనిర్వాహణపై ఆధారపడి యుండును.

కొన్ని యజ్ఞములు కేవలము ఒక ప్రత్యేక దేవత ప్రీత్యర్థమే నిర్ణయింపబడియున్నను వాస్తవమునకు అన్ని యజ్ఞముల యందును విష్ణువే ముఖ్యభోక్తగా పూజింపబడును. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని శ్రీమద్భగవద్గీత యందును తెలుపబడినది (భోక్తారం యజ్ఞతపసాం). అనగా యజ్ఞపతి ప్రీతియే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. ఇటువంటి యజ్ఞములు యథావిధిగా నిర్వహింపబడినప్పుడు మానవాసారములను తీర్చు వివిధశాఖలకు చెందిన దేవతలా ప్రీతినొందెదరు. తద్ద్వారా ప్రకృతిజన్య పదార్థములందు కొరత యెన్నడును వాటిల్లదు.

యజ్ఞనిర్వాహణము అనేకములైన ఇతరలాభములను గూర్చుచు, అంత్యమున భవబంధము నుండి ముక్తిని సైతము కలిగించును. “ఆహారశుద్ధౌ సత్వశుధ్ధి: సత్వశుద్ధౌ ద్రువాస్మృతి:, స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష:” అని వేదములలో తెలుపబడిన రీతి యజ్ఞనిర్వాహణము ద్వారా సర్వకర్మలు పవిత్రములు కాగలవు. అనగా యజ్ఞము ద్వరా ఆహారపదార్థములు పవిత్రములు కాగలవు. పవిత్రాహారామును భుజించుట ద్వారా మనుజుని స్థితియే పవిత్రముగును. స్థితి యొక్క పవిత్రీకరణ ద్వారా బుద్ధి యందలి సూక్ష్మగ్రంథులు పవిత్రత నొందగలవు.

ఆ విధముగా స్మృతి పవిత్రమైనప్పుడు మనుజుడు మోక్షమార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవన్నియును కలిసి అంత్యమున అతనిని దివ్యమైన కృష్ణభక్తిభావనకు చేర్చగలవు. అట్టి పరమోత్కృష్టమైన కృష్ణభక్తిభావనయే నేటి మానవసమాజమునకు పరమావశ్యకమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 130 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 11 🌴

11. devān bhāvayatānena te devā bhāvayantu vaḥ
parasparaṁ bhāvayantaḥ śreyaḥ param avāpsyatha

🌷Translation :

The demigods, being pleased by sacrifices, will also please you, and thus, by cooperation between men and demigods, prosperity will reign for all.

🌷 Purport :

The demigods are empowered administrators of material affairs. The supply of air, light, water and all other benedictions for maintaining the body and soul of every living entity is entrusted to the demigods, who are innumerable assistants in different parts of the body of the Supreme Personality of Godhead. Their pleasures and displeasures are dependent on the performance of yajñas by the human being.

Some of the yajñas are meant to satisfy particular demigods; but even in so doing, Lord Viṣṇu is worshiped in all yajñas as the chief beneficiary. It is stated also in the Bhagavad-gītā that Kṛṣṇa Himself is the beneficiary of all kinds of yajñas: bhoktāraṁ yajña-tapasām. Therefore, ultimate satisfaction of the yajña-pati is the chief purpose of all yajñas. When these yajñas are perfectly performed, naturally the demigods in charge of the different departments of supply are pleased, and there is no scarcity in the supply of natural products.

Performance of yajñas has many side benefits, ultimately leading to liberation from material bondage. By performance of yajñas, all activities become purified, as it is stated in the Vedas:

āhāra-śuddhau sattva-śuddhiḥ sattva-śuddhau dhruvā smṛtiḥ smṛti-lambhe sarva-granthīnāṁ vipramokṣaḥ.

By performance of yajña one’s eatables become sanctified, and by eating sanctified foodstuffs one’s very existence becomes purified; by the purification of existence finer tissues in the memory become sanctified, and when memory is sanctified one can think of the path of liberation, and all these combined together lead to Kṛiṣṇa consciousness, the great necessity of present-day society.

🌹 🌹 🌹 🌹 🌹


7 Sept 2019