🌹. శ్రీమద్భగవద్గీత -125 / Bhagavad-Gita - 125 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము -6 🌴
కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇన్ద్రియార్థాన్ విమూడాత్మా మిథ్యాచార: స ఉచ్యతే ||
🌷. తాత్పర్యం :
కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థము లందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించు కొనుచు మిథ్యాచారి యనబడును.
🌷. భాష్యము :
మనస్సునందు ఇంద్రియభోగమును గూర్చి ఆలోచించుచునే ధ్యానతత్పరతను ప్రదర్శించు కపతులు పలువురు గలరు. అట్టివారు కృష్ణభక్తిభావానమునందు కర్మను చేయ నిరాకరింతురు. అట్టి మిథ్యాచారులు తమను అనుసరించు శిష్యులను భ్రమింపచేయుటకు శుష్కవేదాంతమును సైతము పలుకుదురు. ఈ శ్లోకము ప్రకారము అట్టి వారందరును గొప్ప మోసకారులు.
ఇంద్రియప్రీతి కోరినవాడు వర్ణాశ్రమధర్మమును పాటించుచు తనకు సంబంధించిన నియమనిబంధనలను అనుసరించినచో క్రమముగా తనను తాను పవిత్రుని కావించుకొనగలడు. కాని యోగివలె నటించుచు ఇంద్రియార్థములను వెదుకువాడు కొన్నిమార్లు తత్త్వముపై ప్రవచనములను గావించినను గొప్ప మోసకారి యనియే పిలువబడును.
అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానుని మాయచే హరింపబడును గావున వాని జ్ఞానమునకు ఎట్టి విలువయు ఉండదు. అటువంటి కపటాత్ముని మనస్సు సదా అపవిత్రమై యుండుట వలన అతని ధ్యానప్రదర్శనము సర్వదా ప్రయోజనశూన్యమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 125 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 6 🌴
karmendriyāṇi saṁyamya ya āste manasā smaran
indriyārthān vimūḍhātmā mithyācāraḥ sa ucyate
🌷Translation :
One who restrains the senses of action but whose mind dwells on sense objects certainly deludes himself and is called a pretender.
🌷 Purport :
There are many pretenders who refuse to work in Kṛṣṇa consciousness but make a show of meditation, while actually dwelling within the mind upon sense enjoyment. Such pretenders may also speak on dry philosophy in order to bluff sophisticated followers, but according to this verse these are the greatest cheaters.
For sense enjoyment one can act in any capacity of the social order, but if one follows the rules and regulations of his particular status, he can make gradual progress in purifying his existence. But he who makes a show of being a yogī while actually searching for the objects of sense gratification must be called the greatest cheater, even though he sometimes speaks of philosophy.
His knowledge has no value, because the effects of such a sinful man’s knowledge are taken away by the illusory energy of the Lord. Such a pretender’s mind is always impure, and therefore his show of yogic meditation has no value whatsoever.
🌹 🌹 🌹 🌹 🌹
2 Sept 2019