శ్రీమద్భగవద్గీత - 146: 03వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 146: Chap. 03, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత -146 / Bhagavad-Gita - 146 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 27 🌴


27. ప్రకృతే: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ: |
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||


🌷. తాత్పర్యం :

మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును.


🌷. భాష్యము :

కృష్ణభక్తిభావనాయుతుడు, భౌతికభావన యందున్నవాడు అను ఇరువురు వ్యక్తులు ఒకే స్థాయిలో కర్మనొనరించుచు ఒకే పదము నందున్నట్లుగా గోచరింతురు. కాని వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేష వ్యత్యాసమున్నది. భౌతికభావన యందున్నవాడు మిథ్యాహంకారము చేత తననే ప్రతిదానికి కర్తగా భావించును. దేహము ప్రకృతిచే సృష్టించ బడినదనియు మరియు అట్టి ప్రకృతి భగవానుని నిర్దేశము నందు వర్తించుననియు అతడు ఎరుగడు. అనగా అట్టి లౌకికుడు తాను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అదుపులోనే ఉన్నాననెడి జ్ఞానమును కలిగియుండడు. మిథ్యాహంకారపూరితుడగు తాను స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము.

అట్టివాడు స్థూల, సూక్ష్మదేహములు రెండును భగవానుని ఆదేశానుసారము ప్రకృతిచే సృష్టింపబడినవనియు మరియు తన మానసికకర్మలు, దేహపరకర్మలన్నియును భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని సేవ యందు నియుక్తము కావలెననియు ఎరుగడు. అజ్ఞానియైనవాడు బహుకాలము తన ఇంద్రియములను ఇంద్రియభోగములందు దురుపయోగము కావించినందున శ్రీకృష్ణభగవానుడు హృషీకేశుడని (దేహేంద్రియములకు ప్రభువు) తెలిసికొనలేడు. అట్టివాడు శ్రీకృష్ణభగవానునితో గల నిత్య సంబంధమును మరపింపచేయు మిథ్యాహంకారముచే నిక్కముగా మోహపరవశుడైనట్టి వాడే.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 146 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 3 - Karma Yoga - 27 🌴


27. prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ
ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate


🌷Translation :

The spirit soul bewildered by the influence of false ego thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material nature.


🌷 Purport :

Two persons, one in Kṛiṣhṇa consciousness and the other in material consciousness, working on the same level, may appear to be working on the same platform, but there is a wide gulf of difference in their respective positions. The person in material consciousness is convinced by false ego that he is the doer of everything. He does not know that the mechanism of the body is produced by material nature, which works under the supervision of the Supreme Lord.

The materialistic person has no knowledge that ultimately he is under the control of Kṛiṣhṇa. The person in false ego takes all credit for doing everything independently, and that is the symptom of his nescience. He does not know that this gross and subtle body is the creation of material nature, under the order of the Supreme Personality of Godhead, and as such his bodily and mental activities should be engaged in the service of Kṛṣṇa, in Kṛiṣṇa consciousness.

The ignorant man forgets that the Supreme Personality of Godhead is known as Hṛṣīkeśa, or the master of the senses of the material body, for due to his long misuse of the senses in sense gratification, he is factually bewildered by the false ego, which makes him forget his eternal relationship with Kṛiṣhṇa.

🌹 🌹 🌹 🌹 🌹


23 Sept 2019