శ్రీమద్భగవద్గీత - 147: 03వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 147: Chap. 03, Ver. 28
🌹. శ్రీమద్భగవద్గీత - 147 / Bhagavad-Gita - 147 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 28 🌴
28. తత్వవిత్తు మాహాబాహో గుణకర్మవిభాగయో: |
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ||
🌷. తాత్పర్యం :
ఓ మాహాబాహో! పరతత్త్వజ్ఞానము కలిగినవాడు భక్తియుతకర్మము మరియు కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి, ఇంద్రియములందును మరియు ఇంద్రియభోగములందును ఆసక్తుడు గాకుండును.
🌷. భాష్యము :
భాష్యము పరతత్త్వము నెరిగినవాడు భౌతిక సంపర్కములో తన హేయస్థితిని గుర్తింపగలుగును. తాను పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణుని అంశననియు మరియు తానూ భౌతికజగమునందు ఉండరాదనియు అతడెరుగును. నిత్యానంద జ్ఞానపూర్ణుడైన భగవానుని అంశగా తన నిజస్థితిని అతడు తెలిసికొనగలిగి ఏదియోనొక కారణము చేత జీవితపు భౌతికభావన యందు చిక్కుబడితినని అవగతము చేసికొనగలుగును.
వాస్తవమునకు పరిశుద్ధస్థితి యందు అతడు తన కర్మములు నన్నింటిని శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవతో ముడివేయవలసియున్నది. కావున అతడు కృష్ణపరకర్మల యందు నియుక్తుడై సమయానుగుణములు మరియు తాత్కాలికములు అయిన ఇంద్రియకర్మల యెడ సహజముగా అసంగుడగును.
అట్టివాడు భౌతికజీవనస్థితి భగవానుని ఆధీనమున ఉన్నటువంటిదని తెలిసి ఎట్టి కర్మఫలముల చేతను కలతనొందకుండును. పైగా వాటిని అతడు భగవత్కరుణగా భావించును. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనెడి మూడు తత్త్వములుగా పరతత్త్వము నెరిగినవాడు శ్రీమద్భాగవతము ననుసరించి “తత్త్వవిత్” యని పిలువబడును
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 147 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 28 🌴
28. tattva-vit tu mahā-bāho guṇa-karma-vibhāgayoḥ
guṇā guṇeṣu vartanta iti matvā na sajjate
🌷 Translation :
One who is in knowledge of the Absolute Truth, O mighty-armed, does not engage himself in the senses and sense gratification, knowing well the differences between work in devotion and work for fruitive results.
🌷 Purport :
The knower of the Absolute Truth is convinced of his awkward position in material association. He knows that he is part and parcel of the Supreme Personality of Godhead, Kṛṣṇa, and that his position should not be in the material creation. He knows his real identity as part and parcel of the Supreme, who is eternal bliss and knowledge, and he realizes that somehow or other he is entrapped in the material conception of life. In his pure state of existence he is meant to dovetail his activities in devotional service to the Supreme Personality of Godhead, Kṛṣṇa. He therefore engages himself in the activities of Kṛṣṇa consciousness and becomes naturally unattached to the activities of the material senses, which are all circumstantial and temporary.
He knows that his material condition of life is under the supreme control of the Lord; consequently he is not disturbed by all kinds of material reactions, which he considers to be the mercy of the Lord. According to Śrīmad-Bhāgavatam, one who knows the Absolute Truth in three different features – namely Brahman, Paramātmā and the Supreme Personality of Godhead – is called tattva-vit, for he knows also his own factual position in relationship with the Supreme.
🌹 🌹 🌹 🌹 🌹
24 Sep 2019