🌹. శ్రీమద్భగవద్గీత - 127 / Bhagavad-Gita - 127 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 8 🌴
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణ: |
శరీరయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణ: ||
🌷. తాత్పర్యం :
నీ విధ్యుక్తధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయన అది అకర్మ కన్నను ఉత్తమమైనది. కర్మ నొనరింపకుండా దేహపోషణము సైతము మనుజుడు చేసికొనజాలడు.
🌷. భాష్యము :
ఉత్తమవంశమునకు చెందినవారమని తప్పుగా ప్రకటించుకొను కపటధ్యానపరులు మరియు ఆధ్యాత్మికోన్నతికై సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యాప్రదర్శనమును కావించు ఘనులు పలువురు కలరు. కాని అర్జునుడు ఆ విధమైన మిథ్యావాది కారాదని శ్రీకృష్ణభగవానుడు తలచెను. పైగా క్షత్రియులకు నిర్దేశింపబడిన కర్మలను అర్జునుడు పాటింపవలెనని భగవానుడు కోరెను.
అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియోధుడు కావున తన స్థానమందే నిలిచి, గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమకార్యము. అట్టి కర్మలు లౌకికుని హృదయమును శుభ్రపరచి భౌతికకల్మషము నుండి అతనిని ముక్తుని చేయగలదు. జీవనార్థమై ఆచరింపబడు నామమాత్ర సన్యాసము శ్రీకృష్ణభగవానుడు కాని, ఏ ధర్మశాస్త్రము కాని అంగీకరించు అవకాశము లేదు.
వాస్తవమునకు ఏదియో ఒక కర్మ ద్వారా మనుజుడు దేహమును పోషింపవలసియుండును. భౌతికభావనల నునిడ్ శుద్ధిపరుపకనే కర్మను చపలత్వముతో త్యజింపరాదు. భౌతికజగము నందున్న ప్రతియోక్కరికిని ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెననెడి కల్మషభవములు ( వేరుమాటలలో ఇంద్రియభోగవాంచలు) తప్పకయుండును. అటువంటి కలుషితభవములు తప్పక నశింపవలెను. విధ్యుక్తధర్మముల ద్వారా అట్టి కార్యము సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగి వలె అగుటకు ఎవ్వరును యత్నింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 127 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 8 🌴
8. niyataṁ kuru karma tvaṁ karma jyāyo hy akarmaṇaḥ
śarīra-yātrāpi ca te na prasidhyed akarmaṇaḥ
🌷Translation :
Perform your prescribed duty, for doing so is better than not working. One cannot even maintain one’s physical body without work.
🌷 Purport :
There are many pseudo meditators who misrepresent themselves as belonging to high parentage, and great professional men who falsely pose that they have sacrificed everything for the sake of advancement in spiritual life. Lord Kṛṣṇa did not want Arjuna to become a pretender. Rather, the Lord desired that Arjuna perform his prescribed duties as set forth for kṣatriyas.
Arjuna was a householder and a military general, and therefore it was better for him to remain as such and perform his religious duties as prescribed for the householder kṣatriya. Such activities gradually cleanse the heart of a mundane man and free him from material contamination. So-called renunciation for the purpose of maintenance is never approved by the Lord, nor by any religious scripture. After all, one has to maintain one’s body and soul together by some work. Work should not be given up capriciously, without purification of materialistic propensities.
Anyone who is in the material world is certainly possessed of the impure propensity for lording it over material nature, or, in other words, for sense gratification. Such polluted propensities have to be cleared. Without doing so, through prescribed duties, one should never attempt to become a so-called transcendentalist, renouncing work and living at the cost of others.
🌹 🌹 🌹 🌹 🌹
4 Sept 2019