శ్రీమద్భగవద్గీత - 075: 02వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 075: Chap. 02, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 75 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 28 🌴

28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||



🌷. తాత్పర్యం :

సృజింపబడిన జీవులందరు ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి యెడ దుఃఖించుటకు అవసరమేమి కలదు?


🌷. భాష్యము :

ఆత్మ ఉనికిని అంగీకరించువారు మరియు ఆత్మ ఉనికిని అంగీకరింపనివారు అనుచు తత్వవేత్తలు రెండు రకములుగా నున్నారు. వీరిలో ఎవరిని అనుసరించినప్పటికిని దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. వేదజ్ఞానము ననుసరించువారు ఆత్మ ఉనికిని అంగీకరింపని వారిని నాస్తికులని పిలుతురు.

మాటవరుసకు ఆ నాస్తికవాదమును గ్రహించినను దుఃఖమునకు ఎత్తి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండగా భౌతికాంశములన్నియును సృష్టికి పూర్వము అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్తస్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును.

భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక ఎత్తైన భవంతిని ఉదాహరణముగా గైకొననిచో అది భూమ యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని కూలగొట్టి నప్పుడు అది తిరిగి అవ్యక్తమైదాని పదార్థములులన్నియును భూమిలో కలసిపోవును. శక్తి యనునది సృష్టింపబడదు మరియు నశింపబడదనెడి సిద్ధాంతము ప్రకారము శక్తి అక్షయమై యున్నను కాలములో అనేకములు వ్యక్తములై తిరిగి అవ్యక్తములగు చుండును.

అట్టి యెడ వాటి వ్యక్తస్థితి గూర్చియు లేదా అవ్యక్తస్థితిని గూర్చియు దుఃఖించుటకు కారణమేమి? అవ్యక్తస్థితి యందు వాటికి నాశము లేదు. ఆద్యంతములు రెండింటి యందును అవి అవ్యక్తరూపమున నిలిచి మధ్యలో వ్యక్తములగుచున్నవి. కాని అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు.

దేహము కాలక్రములో నశించు స్వభావము కలది(అన్తవన్త ఇమే దేహా:) అయినను ఆత్మ శాస్వతమైనదని (నిత్యస్యోక్తా: శరీరిణ:) యనెడి భగవద్గీత యందు తెలుపబడిన వేదసారాంశమును మనము అంగీకరింతుమేని ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సదా జ్ఞప్తి యందుంచు కొనవలెను. కావున వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖించవలెను? ఆత్మతో పోల్చినచో దేహమునకెట్టి అస్తిత్వము లేదు.

అది ఒక స్వప్నము వంటిది. స్వప్నములో కొన్నిమార్లు మనము ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథము నందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కాని మేల్కొంచినంతనే మనము ఆకాశమున గాని, రథమునందు గాని లేమని భోధపడగలదు.

భౌతికదేహపు అస్తిత్వలేమిని ఆధారము చేసికోనియే వేదజ్ఞానము మనుజుని ఆత్మానుభవమునకు ప్రోత్సహించుచున్నది. కావున ఆత్మ యొక్క అస్తిత్వము అంగీకరించినను లేదా అంగీకరింపకున్నను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 75 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 28 🌴

28. avyaktādīni bhūtāni vyakta-madhyāni bhārata
avyakta-nidhanāny eva tatra kā paridevanā


🌻 Translation :

All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when annihilated. So what need is there for lamentation?

🌻 Purport :

Accepting that there are two classes of philosophers, one believing in the existence of the soul and the other not believing in the existence of the soul, there is no cause for lamentation in either case.

Nonbelievers in the existence of the soul are called atheists by followers of Vedic wisdom. Yet even if, for argument’s sake, we accept this atheistic theory, there is still no cause for lamentation.

Apart from the separate existence of the soul, the material elements remain unmanifested before creation. From this subtle state of nonmanifestation comes manifestation, just as from ether, air is generated; from air, fire is generated; from fire, water is generated; and from water, earth becomes manifested.

From the earth, many varieties of manifestations take place. Take, for example, a big skyscraper manifested from the earth. When it is dismantled, the manifestation becomes again unmanifested and remains as atoms in the ultimate stage.

🌹 🌹 🌹 🌹 🌹

#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

Join and Share

🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


16 Jul 2019