🌹. శ్రీమద్భగవద్గీత - 90 / Bhagavad-Gita - 90 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 43 🌴
43. కామాత్మాన: స్వర్గపరా
జన్మ కర్మఫలప్రదాయమ్ |
క్రియావిశేషబహులాం
భోగైశ్వర్యగతిం ప్రతి ||
🌷. తాత్పర్యం :
స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటి వానిని, భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు.
🌻. భాష్యము :
అటువంటి అనుభవశూన్య జనులకు కృష్ణభక్తిభావన యందు స్థిరప్రయోజనముతో నెలకొనియుండుట మిగుల కష్టతరము. విషపూర్ణవృక్షపు పుష్పముల యెడ గల ఆకర్షణ పరిణామము నెరుగక మూడుడు వాని యందలి భోగముల యెడ ఆకర్షితులగుదురు.
“అపామ సోమమమృతా అభూమ మరియు అక్ష్యయ్యమ్ హ వై చాతుర్మాస్యయాజిన: సుకృతం భవతి” యని వేదపు కర్మకాండ భాగములో తెలుపబడినది. అనగా వేరుమాటలలో చాతుర్మాస్య వ్రతమును పాటించినవాడు సోమరసమును త్రాగి అమృతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హుడగుచున్నాడు. సోమరసముతో బలమును పొంది, భోగానుభవమును పొందవలెనని భూమిపై కూడా కొందరు అభిలషింతురు. అట్టివారు భవబంధముల నుండి ముక్తి యెడ శ్రద్ధను చూపక కేవలము ఆర్భాటము కలిగిన వైదియజ్ఞములందే రతులగుదురు.
భోగలాలసులైన అట్టివారు స్వర్గభోగములను తప్ప వేరేదియును కోరరు. స్వర్గమునందు నందకాననమనెడి ఉద్యానవనము కలదనియు మరియు అందు సుందరస్త్రీ సాంగత్యము, కోరినంతగా సోమరసము లభించుననియు తెలుపబడినది. అట్టి దేహపర సౌఖ్యము నిక్కముగా ఇంద్రియపరమైనట్టిది. కనుకనే భౌతికజగత్తునకు ప్రభువులమనెడి భావనలో నిలిచి అట్టి లౌకిక తాత్కాలిక సౌఖ్యముల యెడ అనురక్తులై యుండెడివారు పెక్కురు కలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 90 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 43 🌴
43. kāmātmānaḥ svarga-parā janma- karma-phala- pradām
kriyā- viśeṣa- bahulāṁ bhogaiśvarya -gatiṁ prati
🌻 Translation :
For heavenly planets, resultant good birth, power, being desirous of sense gratification and opulent life, they say that there is nothing more than this.
🌻. Purport :
It is very difficult for such inexperienced persons to be situated in the determined action of Kṛṣṇa consciousness. As fools are attached to the flowers of poisonous trees without knowing the results of such attractions, unenlightened men are similarly attracted by such heavenly opulence and the sense enjoyment thereof.
🌹 🌹 🌹 🌹🌹
29 Jul 2019