🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 63 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 16 🌴
16. నాసాతో విద్యతే భావో నాభావో విద్యతే సత: ||
ఉభయోరపి దృష్టో న్తస్త్వనయోస్తత్వ దర్శిభి: ||
🌷. తాత్పర్యం :
అసత్తునకు (భౌతిక దేహము) ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి (ఆత్మ) మార్పు లేదనియు సత్యద్రష్టలైన వారు నిర్ణయించి యున్నారు. ఈ రెండింటి తత్త్వమును బాగుగా అధ్యయనము చేసి వారీ విషయమున ధృవీకరించిరి.
🌷. భాష్యము :
మార్పుచెందు దేహమునకు ఉనికి లేదు. వివిధములైన కణముల చర్య మరియు ప్రతిచర్య వలన దేహము ప్రతిక్షణము మార్పునకు లోనగుచున్నదడని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించియున్నది. కనుకనే దేహము నందు పెరుగుదల మరియు ముసలితనములు కలుగుచున్నవి.
కాని మనోదేహములు ఆ విధముగా సదా మార్పు చెందుచున్నను ఆత్మ మాత్రము ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచియుండును. అదియే భౌతికపదార్థము మరియు ఆత్మల నడుమ గల భేదము. ప్రకృతిరీత్యా దేహము నిత్యపరిణామశీలమై యుండగా ఆత్మ నిత్యత్వ లక్షణమును కలిగియున్నది.
అన్ని తరగతుల సత్యద్రష్టలచే (నిరాకారవాదులు మరియు సాకారవాదులు ఇరువురును) ఈ విషయము ధ్రువీకరింపబడినది. విష్ణువు మరియు అతని ధామములన్నియును స్వయంప్రకాశమాన ఉనికిని కలిగియున్నట్లు (జ్యొతీంషి విష్ణుర్భువనాని విష్ణు:) విష్ణుపురాణము (2.12.38) నందు తెలుపబడినది. అనగా సత్తు,అసత్తు అను పదములు వరుసగా ఆత్మ మరియు భౌతికపదార్థములనే సూచించుచున్నవి. సత్యద్రష్టలందరి అభిప్రాయమిదియే.
అజ్ఞాన ప్రభావముచే మొహపరవశులైన జీవులకు శ్రీకృష్ణభగవాను డొసగిన ఉపదేశపు ఆరంభమిదియే. అజ్ఞానము అంతమొందించుటనెడి కార్యము అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమగల నిత్యసంబధమును పున:స్థాపించుట, భగవానుడు మరియు అతని అంశలైన జీవుల నడుమ గల భేదమును సంపూర్తిగా అవగతము చేసికొనుట యనెడి అంశములను కూడియుండును. భగవానుడు మరియు తన నడుమగల భేదము పూర్ణము మరియు అంశము నడుమగల సంబందము వంటిదని తెలిసి, తనను గుర్చిన సంపూర్ణాధ్యయనము కావించుట ద్వారా మనుజుడు భగవతత్త్వమును అవగతము చేసికొనగలడు.
🌹🌹🌹🌹🌹
🌹 Bhagavad-Gita as It is - 63 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 16 🌴
16. nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ ubhayor api dṛṣṭo ’ntas tv anayos tattva-darśibhiḥ
🌷 Translation :
Those who are seers of the truth have concluded that of the nonexistent [the material body] there is no endurance and of the eternal [the soul] there is no change. This they have concluded by studying the nature of both.
🌷Purport :
There is no endurance of the changing body. That the body is changing every moment by the actions and reactions of the different cells is admitted by modern medical science; and thus growth and old age are taking place in the body. But the spirit soul exists permanently, remaining the same despite all changes of the body and the mind. That is the difference between matter and spirit. By nature, the body is ever changing, and the soul is eternal.
This conclusion is established by all classes of seers of the truth, both impersonalist and personalist. In the Viṣṇu Purāṇa (2.12.38) it is stated that Viṣṇu and His abodes all have self-illuminated spiritual existence (jyotīṁṣi viṣṇur bhuvanāni viṣṇuḥ). The words existent and nonexistent refer only to spirit and matter. That is the version of all seers of truth.
This is the beginning of the instruction by the Lord to the living entities who are bewildered by the influence of ignorance. Removal of ignorance involves the reestablishment of the eternal relationship between the worshiper and the worshipable and the consequent understanding of the difference between the part-and-parcel living entities and the Supreme Personality of Godhead.
One can understand the nature of the Supreme by thorough study of oneself, the difference between oneself and the Supreme being understood as the relationship between the part and the whole.
🌹🌹🌹🌹🌹
4 Jul 2019