శ్రీమద్భగవద్గీత - 065: 02వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 065: Chap. 02, Ver. 18



🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 65 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 18 🌴


18. అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: |
అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత ||


🌷. తాత్పర్యం :

అవినాశియును, అపరిమితుడును, నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా! నీవు యుద్ధము చేయుము.


🌷. భాష్యము :

ప్రకృతిరీత్యా దేహము నశించు స్వభావము కలిగియున్నది. అది ఈ క్షణమే నశింపవచ్చును లేదా నూరు సంవత్సరముల పిదపైనను నశింపవచ్చును. అనగా అది నిలిచియుండును కాలము మారవచ్చును గాని, అనంతముగా దానిని పోషించుతాకు అవకాశమే లేదు. కాని ఆత్మ అతిసూక్ష్మమైనది. దానిని గాంచుటకైనను శత్రువులకు సాధ్యము కాదు. అట్టియెడ వధించుతను గూర్చి వేరుగా తెలుపపనిలేదు.

గత శ్లోకములో తెలుపబడినరీతి అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణము కొలుచు పద్దతిని ఎవ్వరును ఎరుంగరు. అట్టి ఆత్మ ఎవ్వరి చేతను చంపబడదు. కాని కోరినంతకాలము లేదా శాశ్వతముగా దేహము రక్షింపబడదు. అనగా ఈ రెండు కోణములలో దేని ద్వారా గాంచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అణుపరిమాణ ఆత్మ వివిధములైన దేహములను ధరించును గావున ధర్మాచారణమును ప్రతియొక్కరు తప్పక అవలంబింప వలసియున్నది.

జీవుడు దివ్యప్రకాశపు అంశయైన కారణమున వేదాంతసూత్రములందు అతడు ప్రకాశమానునిగా అంగీకరింపబడినాడు. కనుకనే సూర్యిని కాంతి సమస్తజగత్తును పోషించురీతి, ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది.

అట్టి ఆత్మ దేహము నుండి తొలగినంతనే దేహము క్రుళ్ళుట నారంభించును. అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నది. దేహము స్వత: ముఖ్యమైనది కాదు. కనుకనే లౌకికమైన దేహపరభావనలచే ధర్మమును త్యజింపక యుద్ధమాచరింపుమని అర్జునుడు ఉపదేశ మొసగబడినది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 65 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 18 🌴


18. antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ anāśino ’prameyasya tasmād yudhyasva bhārata


🌷 Translation :

The material body of the indestructible, immeasurable and eternal living entity is sure to come to an end; therefore, fight, O descendant of Bharata.


🌷. Purport :

The material body is perishable by nature. It may perish immediately, or it may do so after a hundred years. It is a question of time only. There is no chance of maintaining it indefinitely. But the spirit soul is so minute that it cannot even be seen by an enemy, to say nothing of being killed.

As mentioned in the previous verse, it is so small that no one can have any idea how to measure its dimension. So from both viewpoints there is no cause of lamentation, because the living entity as he is cannot be killed nor can the material body be saved for any length of time or permanently protected. The minute particle of the whole spirit acquires this material body according to his work, and therefore observance of religious principles should be utilized.

In the Vedānta-sūtras the living entity is qualified as light because he is part and parcel of the supreme light. As sunlight maintains the entire universe, so the light of the soul maintains this material body.

As soon as the spirit soul is out of this material body, the body begins to decompose; therefore it is the spirit soul which maintains this body. The body itself is unimportant. Arjuna was advised to fight and not sacrifice the cause of religion for material, bodily considerations.

🌹🌹🌹🌹🌹


16 Jul 2021