శ్రీమద్భగవద్గీత - 069: 02వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 069: Chap. 02, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 69 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 22 🌴


22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాటి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాస్య అన్యాని సంయాతి నవాని దేహీ ||

🌷. తాత్పర్యం :

మనుజుడు పాతవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి, ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది.

🌷. భాష్యము :

ఆత్మ దేహములను మార్చుననెడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని అంగీకరింపని ఆధునిక విజ్ఞానశాస్త్రవేత్తలు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను, దేహమునందు జరిగెడి మార్పులను అంగీకరించియే తీరవలెను.

శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యౌవనము వరకు, యౌవనము నుండి ముసలితనము వరకు కలుగు దేహమునందలి మార్పులను వారు అంగీకరింపవలసియున్నది. ముసలితనము పిమ్మట మార్పు అనునది వేరొక దేహమును కలుగజేయును. ఈ విషయమును ఇదివరకే పూర్వశ్లోకము(2.13) నందు వివరింపబడినది.

ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కరుణచే సాధ్యపడుచున్నది. స్నేహితుని కోరికను ఇంకొక స్నేహితుడు తీర్చు రీతి, ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు తీర్చును.

ఆత్మ మరియు పరమాత్మలను ఒకే వృక్షముపై కూర్చొనియున్న రెండు పక్షులతో ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి(ఆత్మ) వృక్షఫలములను ఆరగించుచుండగా, వేరొక పక్షి (శ్రీకృష్ణుడు) తన మిత్రుని గాంచుచున్నది.

ఈ పక్షులు రెండును గుణరీతిని ఏకమైనను, అందొకటి భౌతికవృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములను కేవలము సాక్షిగా నిలిచియున్నది. ఇచ్చట శ్రీకృష్ణుడు సాక్షియైన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షియై యున్నాడు. వారివురు స్నేహితులే అయినను అందులో ఒకరు గురువు కాగా, రెండవవాడు శిష్యుడై యున్నాడు.

ఈ సంబంధమును మరచుటయే ఆత్మ ఒక వృక్షము నుండి వేరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమై యున్నది. అనగా దేహమనెడి వృక్షముపై జీవాత్మ తీవ్రప్రయాస నొందుచుండును. కాని అది చెంతనే ఉన్న మిత్రుడైన వేరొక పక్షిని గురువుగా అంగీకరించినంతనే శీఘ్రముగా సర్వశోకముల నుండి ముక్తినొందగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 69 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 22 🌴


22. vāsāṁsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti naro ’parāṇi tathā
śarīrāṇi vihāya jīrṇāny anyāni saṁyāti navāni dehī

🌻 Translation :

As a person puts on new garments, giving up old ones, the soul similarly accepts new material bodies, giving up the old and useless ones.

🌻 Purport :

Change of body by the atomic individual soul is an accepted fact. Even the modern scientists who do not believe in the existence of the soul, but at the same time cannot explain the source of energy from the heart, have to accept continuous changes of body which appear from childhood to boyhood and from boyhood to youth and again from youth to old age. From old age, the change is transferred to another body. This has already been explained in a previous verse (2.13).

Transference of the atomic individual soul to another body is made possible by the grace of the Supersoul. The Supersoul fulfills the desire of the atomic soul as one friend fulfills the desire of another.

The Vedas, like the Muṇḍaka Upaniṣad (3.1.2), as well as the Śvetāśvatara Upaniṣad (4.7), compare the soul and the Supersoul to two friendly birds sitting on the same tree. One of the birds (the individual atomic soul) is eating the fruit of the tree, and the other bird (Kṛṣṇa) is simply watching His friend.

Of these two birds – although they are the same in quality – one is captivated by the fruits of the material tree, while the other is simply witnessing the activities of His friend. Kṛṣṇa is the witnessing bird, and Arjuna is the eating bird. Although they are friends, one is still the master and the other is the servant. Forgetfulness of this relationship by the atomic soul is the cause of one’s changing his position from one tree to another, or from one body to another.

The jīva soul is struggling very hard on the tree of the material body, but as soon as he agrees to accept the other bird as the supreme spiritual master the subordinate bird immediately becomes free from all lamentations.

🌹 🌹 🌹 🌹 🌹


10 Jul 2019