🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 61 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 14 🌴
14. మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదు:ఖదా: |
ఆగమపాయినో నిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ||
🌷. తాత్పర్యం :
ఓ కౌంతేయా! తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల వంటివి. ఓ భరతవంశీయుడా! ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత నొందక సహించుట మనుజుడు నేర్వవలెను.
🌷. భాష్యము :
విధ్యుక్తధర్మమును చక్కగా నిర్వహించుట యందు సుఖ:దుఖముల తాత్కాలికమైన రాకపోకలు సహించుట ప్రతియెక్కరు నేర్వవలెను. వేదనియమము ప్రకారము మాఘమాసము నందును (జనవరి-ఫిభ్రవరి) తెలావారుఝాముననే స్నానమాచరింపవలెను. ఆ సమయమున వాతావరణము అతిచలిగా నున్నను వేదనియమా చరణమునకు కట్టుబడినవాడు తత్కారమునకు సంశయింపరు.
అదే విధముగా ఎండాకాలపు అతివేడి సమయమున మే,జూన్ నెలల యందు కుడా స్త్రీలు వంటశాల యందు వండుటకు సంశయింపరు. అనగా వాతావరణపు అసౌకర్యములు కలిగినప్పటికిని మనుజుడు తన విధ్యుక్తధర్మమును నిర్వహింపవలెను. ఆ రీతిగనే యుద్ధమనునది క్షత్రియధర్మము.
అట్టి యుద్దమును స్నేహితుడు లేదా బంధువుతో చేయవలసివచ్చినను క్షత్రియుడైనవాడు తన విధ్యుక్తధర్మము నుండి వైదొలగరాదు. జ్ఞానస్థాయికి ఎదుగుట కొరకై మనుజుడు నిర్దేశిత నియమనిబంధనలను అనుసరింపవలెను. ఏలయన కేవలము జ్ఞానము మరియు భక్తి ద్వారానే ఎవడైనను తనను తాను మాయాబంధముల నుండి ముక్తుని గావించు కొనగలడు.
ఈ శ్లోకమున అర్జునుని సంభోధించిన రెండు నామములకు ప్రాశస్త్యము కలదు. కౌంతేయ అనెడి సంబోధన అతని తల్లి తరపున గల రక్తసంబంధమును, భారత అనెడి సంబోధనము తండ్రి ద్వారా సంక్రమించిన గొప్పదనమును సూచించుచున్నది. ఈ విధముగా రెండు వైపుల నుండియు అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగియున్నాడు. అట్టి వారసత్వము స్వీయధర్మపాలన యందు గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్దమును నిరాకరించుటకు అవకాశము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 61 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 14 🌴
14. mātrā-sparśās tu kaunteya śītoṣṇa-sukha-duḥkha-dāḥ āgamāpāyino ’nityās tāṁs titikṣasva bhārata
🌷 Translation :
O son of Kuntī, the nonpermanent appearance of happiness and distress, and their disappearance in due course, are like the appearance and disappearance of winter and summer seasons. They arise from sense perception, O scion of Bharata, and one must learn to tolerate them without being disturbed.
🌷 Purport :
In the proper discharge of duty, one has to learn to tolerate nonpermanent appearances and disappearances of happiness and distress. According to Vedic injunction, one has to take his bath early in the morning even during the month of Māgha (January-February). It is very cold at that time, but in spite of that a man who abides by the religious principles does not hesitate to take his bath. Similarly, a woman does not hesitate to cook in the kitchen in the months of May and June, the hottest part of the summer season.
One has to execute his duty in spite of climatic inconveniences. Similarly, to fight is the religious principle of the kṣatriyas, and although one has to fight with some friend or relative, one should not deviate from his prescribed duty. One has to follow the prescribed rules and regulations of religious principles in order to rise up to the platform of knowledge, because by knowledge and devotion only can one liberate himself from the clutches of māyā (illusion).
The two different names of address given to Arjuna are also significant. To address him as Kaunteya signifies his great blood relations from his mother’s side; and to address him as Bhārata signifies his greatness from his father’s side. From both sides he is supposed to have a great heritage. A great heritage brings responsibility in the matter of proper discharge of duties; therefore, he cannot avoid fighting.
🌹🌹🌹🌹🌹
02 Jul 2019