✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 19 🌴
19. య ఏనం వేత్తి హన్తారాం యశ్చైనం మన్యతే హతం |
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ||
🌷. తాత్పర్యం :
జీవుడు చంపువాడని తలచువాడు గాని, చంపబడువాడని భావించువాడు గాని జ్ఞానవంతులు కారు. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు.
🌷. భాష్యము :
మారణాయుధములచే దేహధారి గాయపడినపుడు దేహమునందలి జీవుడు మాత్రము చంపబడడని ఎరుగవలెను. అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎత్తి ఆయుధములచేతను సాధ్యము కాదు. ఈ విషయము రాబోవు శ్లోకముల ద్వారా నిరూపణ కాగలదు.
అంతియేగాక దివ్యమైన ఆధ్యాత్మికస్థితి కారణముగా ఆత్మ వధార్హము కాదు. అనగా చంపబడునది లేదా చంపబడవలసినది కేవలము దేహము మాత్రమే. అయినను దీని ఉద్దేశ్యము దేహవధను ప్రోత్సహించుట కాదు. “మా హింస్యాత్ సర్వభూతాని” యను వేదనియమము ప్రకారము ఎవ్వరి యెడను హింసను ప్రదర్శించరాదు. అలాగుననే జీవుడెన్నడును చంపబడడని అవగాతమగుట జంతువధను ప్రోత్సహించుట ఎన్నడను కాదు.
అధికారము లేకుండా ఎవరినేని వధించుట అత్యంత హేయమైన కార్యము. అట్టి చర్య దేశనియమము ప్రకారము మరియు భగవన్నియమము ప్రకారము దండనీయమే కాగలదు. కాని ఇచ్చట అర్జునుడు ధర్మము కొరకే సంహారము నందు నియోగింప బడుచుండెను గాని విపరీత తలంపుతో కాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 66 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 19 🌴
19. ya enaṁ vetti hantāraṁ yaś cainaṁ manyate hatam
ubhau tau na vijānīto nāyaṁ hanti na hanyate
🌷 Translation :
Neither he who thinks the living entity the slayer nor he who thinks it slain is in knowledge, for the self slays not nor is slain.
🌷 Purport :
When an embodied living entity is hurt by fatal weapons, it is to be known that the living entity within the body is not killed. The spirit soul is so small that it is impossible to kill him by any material weapon, as will be evident from subsequent verses.
Nor is the living entity killable, because of his spiritual constitution. What is killed, or is supposed to be killed, is the body only. This, however, does not at all encourage killing of the body. The Vedic injunction is mā hiṁsyāt sarvā bhūtāni: never commit violence to anyone. Nor does understanding that the living entity is not killed encourage animal slaughter.
Killing the body of anyone without authority is abominable and is punishable by the law of the state as well as by the law of the Lord. Arjuna, however, is being engaged in killing for the principle of religion, and not whimsically.
🌹🌹🌹🌹🌹
7 Jul 2019