శ్రీమద్భగవద్గీత - 085: 02వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 085: Chap. 02, Ver. 38


🌹. శ్రీమద్భగవద్గీత - 85 / Bhagavad-Gita - 85 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 38 🌴


38. సుఖదుఃఖే సమే కృత్వా
లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాపమువాప్స్యసి ||


🌷. తాత్పర్యం :

సుఖదు:ఖములను గాని, లాభాలాభములను గాని, జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము. ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు.


🌻. భాష్యము :

తాను యుద్దమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణభగవానుడు ఇప్పుడు నేరుగా పలుకుచున్నాడు. కృష్ణపరమైన కర్మల యందు సుఖదు:ఖములు, లాభనష్టములు, జయాపజయములు వంటి భావనలకు తావు లేదు. ప్రతిదియు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరింపవలెననుట ద్వియభావానము.

కావున అట భౌతికకర్మల వలన బంధము కలుగదు. తన ఇంద్రియప్రీత్యర్థమే కర్మనొనరించువాడు నిక్కముగా బద్దుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసమైనను తదనుగుణమైన ఫలము ప్రాప్తించియే తీరును. కాని కృష్ణభక్తిభావనలో సంపూర్ణ శరణాగతి నొందినవాడు అట్లుగాక ఎవ్వరికిని ఋణపడడు మరియు బద్ధుడు కాడు. కాని సామాన్య కార్యము లందు రతుడైనవాడు ఋణియై యున్నాడు. శ్రీమద్భాగవతము (11.5.41) నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.

దేవర్షిభూతాప్తనృణాం పిత్రూణాం న కింకరో నాయం ఋణి చ రాజన్ |
సర్వాత్మనా య: శరణం శరణ్యం గతో ముకున్దం పరిహృత్య కర్తమ్ ||

సర్వధర్మములను త్యజించి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని పొందెడివాడు దేవతలకు గాని, ఋషులకు గాని, జనులకు గాని, బంధువులకు గాని, పితృదేవతలకు గాని ఋణపడియుండడు మరియు సేవకుడు కాబోడు. “ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు పరోక్షముగా ఈ శ్లోకము నందు తెలియజేసేను. రాబోవు శ్లోకములలో ఈ విషయమును మరింత స్పష్టముగా వివరింప బడును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 85 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 38 🌴


38. sukha-duḥkhe same kṛtvā lābhālābhau jayājayau tato yuddhāya yujyasva naivaṁ pāpam avāpsyasi

🌻 Translation :

Do thou fight for the sake of fighting, without considering happiness or distress, loss or gain, victory or defeat – and by so doing you shall never incur sin.

🌻 Purport :

Lord Kṛṣṇa now directly says that Arjuna should fight for the sake of fighting because He desires the battle. There is no consideration of happiness or distress, profit or loss, victory or defeat in the activities of Kṛṣṇa consciousness. That everything should be performed for the sake of Kṛṣṇa is transcendental consciousness; so there is no reaction to material activities.

He who acts for his own sense gratification, either in goodness or in passion, is subject to the reaction, good or bad. But he who has completely surrendered himself in the activities of Kṛṣṇa consciousness is no longer obliged to anyone, nor is he a debtor to anyone, as one is in the ordinary course of activities. It is said:

devarṣi-bhūtāpta nṛṇāṁ pitṝṇāṁ na kiṅkaro nāyam ṛṇī ca rājan sarvātmanā yaḥ śaraṇaṁ śaraṇyaṁ gato mukundaṁ parihṛtya kartam

“Anyone who has completely surrendered unto Kṛṣṇa, Mukunda, giving up all other duties, is no longer a debtor, nor is he obliged to anyone – not the demigods, nor the sages, nor the people in general, nor kinsmen, nor humanity, nor forefathers.” (Bhāg. 11.5.41) That is the indirect hint given by Kṛṣṇa to Arjuna in this verse, and the matter will be more clearly explained in the following verses.

🌹 🌹 🌹 🌹 🌹


25 Jul 2019