🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 60 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 13 🌴
13. దేహినో(స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా | తథా దేహాన్తరప్రాప్థిర్ధీరస్తత్ర న ముహ్యతి ||
🌷. తాత్పర్యం :
దేహధారి దేహమునందు బాల్యము నుండి యౌవనమునకు, యౌవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణానంతరాము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయనున ధీరుడైనవాడు మోహము నొందడు.
🌷 భష్యము :
ప్రతిజీవుడు వ్యక్తిగత ఆత్మయైనందున కొంత సమయము బాలునిగా, మరికొంత సమయము యౌవనవంతునిగా, ఇంకొంత కాలము ముదుసలిగా వ్యక్తమగుచు నిరంతరమ దేహమార్పులకు లోనగుచుండును. అయినప్పటికిని ఆత్మ మాత్రము ఎట్టి మార్పులేక యుండును. అది చివరకు మరణసమయమున దేహము మార్చి వేరొక దేహమునకు ప్రయాణించును.
తదుపరి జన్మలో వేరొక దేహమును(భౌతికము గాని లేదా ఆధ్యాత్మికము గాని) పొందుట నిశ్చయమై యున్నందున భీష్మద్రోణుల మరణ విషయమున అర్జునుడు చింతించుటకు ఎట్టి కారణము లేదు. వారిని గూర్చి అతడు మిగుల వ్యాకుల పడియున్నాడు. కాని వారు తమ పాతదేహములను వదలి నూతనదేహములను పొందుట ద్వారా తిరిగి శక్తిని పొందగలరని అతడు ఆనందింపవలసియున్నది. జీవితమున మనుజుని కర్మ ననుసరించి వివిధములైన సుఖముల కొరకు లేదా దు:ఖముల కొరకు అట్టి దేహమార్పు కలుగుచుండును.
భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పవిత్రాత్ములై నందున తదుపరి జన్మమున నిక్కముగా ఆధ్యాత్మికదేహములను పొందనున్నారు లేదా కనీసము ఉన్నత భోగము కొరకై దేవతాశరీరములను పొందగలరు. ఈ రెండింటిలో ఏది జరిగినను చింతకు కారణమేదియును లేదు.
ఆత్మ, పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియున్నవాడు ధీరుడని పిలువబడును. అట్టివాడు దేహపరమైన మార్పుల యెడ మోహము నొందడు.
మాయావాద సిద్ధాంతము పలుకు ఆత్మ యొక్క అద్వయత్వము ఏమాత్రము అంగీకరింపలేము. ఆత్మ ముక్కలుగా ఖండింపబడలేదనుటయే దానికి ఆధారము. ఆ రీతి వ్యక్తిగతాత్మలుగా ఖండింపబడుట యనునది పరమాత్మను మార్పునొందు వానిగా లేదా ఖండింపబడువానిగా చేయును. అట్టి విషయము పరమాత్మ మార్పురహితమనెడి సిద్ధాంతమునకు వ్యతిరేకమై యున్నది.
భగవద్గీత యందు నిర్దారింపబడిన రీతిగా భగవానుని అంశలు నిత్యముగా(సనాతనులు) నిలిచియుండి క్షరులుగా పిలువబడును. అనగా వారు భౌతికప్రకృతికి పతనము చెందు లక్షణమును కలిగియుందురు. ఈ అంశలు నిత్యముగా తమ అంశరూపమున నిలిచి యుందురు. ముక్తిపొందిన పిమ్మటయు జీవుడు అంశగా మిగిలియుండును. కాని ముక్తి పొందిన పిమ్మట అతడు ఆనందము మరియు జ్ఞానములను గూడి దేవదేవునితో నిత్యజీవనమును పొందును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 60 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 13 🌴
13. dehino ’smin yathā dehe
kaumāraṁ yauvanaṁ jarā
tathā dehāntara-prāptir
dhīras tatra na muhyati
🌷 Translation :
As the embodied soul continuously passes, in this body, from boyhood to youth to old age, the soul similarly passes into another body at death. A sober person is not bewildered by such a change.
🌷 Purport :
Since every living entity is an individual soul, each is changing his body every moment, manifesting sometimes as a child, sometimes as a youth and sometimes as an old man. Yet the same spirit soul is there and does not undergo any change.
This individual soul finally changes the body at death and transmigrates to another body; and since it is sure to have another body in the next birth – either material or spiritual – there was no cause for lamentation by Arjuna on account of death, neither for Bhīṣma nor for Droṇa, for whom he was so much concerned. Rather, he should rejoice for their changing bodies from old to new ones, thereby rejuvenating their energy. Such changes of body account for varieties of enjoyment or suffering, according to one’s work in life. So Bhīṣma and Droṇa, being noble souls, were surely going to have spiritual bodies in the next life, or at least life in heavenly bodies for superior enjoyment of material existence. So, in either case, there was no cause of lamentation.
Any man who has perfect knowledge of the constitution of the individual soul, the Supersoul, and nature – both material and spiritual – is called a dhīra, or a most sober man. Such a man is never deluded by the change of bodies.
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
1 Jul 2019