శ్రీమద్భగవద్గీత - 086: 02వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 086: Chap. 02, Ver. 39


🌹. శ్రీమద్భగవద్గీత - 86 / Bhagavad-Gita - 86 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 39 🌴


39. ఏషా తేభిహితా సాంఖ్యే
బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు |
బుద్ధ్యా యుక్తో యయా
పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ||


🌷. తాత్పర్యం :

ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ననుసరించి నీకు వివరించితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమున వివరించెదను ఆలకింపుము. ఓ పృథాకుమారా! అట్టి జ్ఞానము ననుసరించి నీవు వర్తింతువేని కర్మబంధము నుండి విడివడగలవు.

🌻. భాష్యము :

వేదనిఘంటువైన “నిరుక్తి” ననుసరించి “సాంఖ్యము” అనగా సంపూర్ణముగా వివరించునదని భావము. సాంఖ్య మనునది ఆత్మ యొక్క నిజస్వభావమును వివరించు తత్త్వము కాగా, యోగము ఇంద్రియముల నియమమును కూడియుండును.

ఇచ్చట యుద్ధము నుండి విరమించుటనెడి అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ ప్రీతిపై ఆధారపడి యున్నది. ధృతరాష్ట్రుని తనయులైన తన సోదరులను, జ్ఞాతులను యుద్ధములో జయించి రాజ్యము ననుభవించుట కన్నాను వారిని యుద్ధములో వధింపకుండుట తనకు ఎక్కువ ఆనందమును కలుగజేయునని తలచియుండుట చేతనే ముఖ్యధర్మమును మరచి అతడు యుద్ధము నుండి విరమిమప గోరెను.

అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములను ఇంద్రియ ప్రీతికి సంబంధించినవే. వారిని జయించుటచే కలిగెడి ఆనందము మరియు వారిని జీవితులుగా గాంచుటచే ఒసగూడెడి ఆనందము రెండును జ్ఞాన ధర్మములను పణముగా పెట్టునటువంటి దేహభావనపై ఆధారపడియున్నవి. పితామహుని దేహమును వధించుట ఆత్మను వధించుట కాబోదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు వివరింపగోరెను.

సర్వులు ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరును శాశ్వతముగా వ్యక్తిగతులనియు, అందరును భూత, భవిష్యత్, వర్తమానములందిన్ని వేళలా ఉండగలరనియు భగవానుడు వివరించెను. కేవలము మనము దేహములనే పలురీతులుగా మార్చుచున్నాము. కాని దేహబంధము నుండి ముక్తి పిదపయు మన వ్యక్తిత్వము నిలిచియుండును. ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణను శ్రీకృష్ణభగవానుడు తెలియజేసెను. వివిధకోణములలో కావింపబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానమే నిరుక్తి నిఘంటువు ననుసరించి సాంఖ్యజ్ఞానముగా తెలుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 86 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 39 🌴



39. eṣā te ’bhihitā sāṅkhye buddhir yoge tv imāṁ śṛṇu
buddhyā yukto yayā pārtha karma-bandhaṁ prahāsyasi


🌻 Translation :

Thus far I have described this knowledge to you through analytical study. Now listen as I explain it in terms of working without fruitive results. O son of Pṛthā, when you act in such knowledge you can free yourself from the bondage of works.

🌻 Purport :

According to the Nirukti, or the Vedic dictionary, saṅkhyā means that which describes things in detail, and sāṅkhya refers to that philosophy which describes the real nature of the soul. And yoga involves controlling the senses. Arjuna’s proposal not to fight was based on sense gratification. Forgetting his prime duty, he wanted to cease fighting, because he thought that by not killing his relatives and kinsmen he would be happier than by enjoying the kingdom after conquering his cousins and brothers, the sons of Dhṛtarāṣṭra. In both ways, the basic principles were for sense gratification.

Happiness derived from conquering them and happiness derived by seeing kinsmen alive are both on the basis of personal sense gratification, even at a sacrifice of wisdom and duty. Kṛṣṇa, therefore, wanted to explain to Arjuna that by killing the body of his grandfather he would not be killing the soul proper, and He explained that all individual persons, including the Lord Himself, are eternal individuals; they were individuals in the past, they are individuals in the present, and they will continue to remain individuals in the future, because all of us are individual souls eternally.

We simply change our bodily dress in different manners, but actually we keep our individuality even after liberation from the bondage of material dress. An analytical study of the soul and the body has been very graphically explained by Lord Kṛṣṇa. And this descriptive knowledge of the soul and the body from different angles of vision has been described here as Sāṅkhya, in terms of the Nirukti dictionary.

🌹 🌹 🌹 🌹 🌹


26 Jul 2019