🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 72 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 25 🌴
25. అవ్యక్తో యమచిన్త్యో యమవికార్యో య ముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||
🌷. తాత్పర్యం :
ఈ అత్మ కనబడనిది, ఊహింపరానిది, మార్పు రహితము అని చెప్పబడినది. అందుచే ఈ విధముగా దానిని బాగుగా తెలిసికొని, నీవు ఈ శరీరము కొరకు దుఃఖించుటకు తగవు.
🌷. భాష్యము :
ఇదివరకు వివరింపబడిన రీతి ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతను అది దర్శింపబడదు. కనుకనే అది అవ్యక్తమని తెలుపబడినది. ఇక డని అస్తిత్వమునకు సమంధించినంతవరకు శృతి లేదా వేదంజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవ్వరును ప్రయోగాత్మకముగా నిర్దారింపలేరు.
అనుభవైకవేద్యమైన ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసియున్నది. కొన్ని విషయములు మనము కేవలము ఉన్నతమగు ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసివచ్చును.
ఉదాహరణమునకు తల్లి ప్రామాణికతపై ఆధారపడి తండ్రి ఉనికిని గుర్తించుట సాధారణముగా జరుగుచుండును. అచ్చట తండ్రిని గుర్తించుటకు తల్లి ప్రామాణికత ఒక్కటే మార్గము. అదేవిధముగా ఆత్మను అవగతము చేసికొనుటకు కేవలము వేదాధ్యనము తప్ప వేరొక్క మార్గము లేదు. వేరుమాటలలో ఆత్మ యనునది మానవ మావవ ప్రయోగాత్మక జ్ఞానముచే అవగతము కానట్టిది.
ఆత్మ చైతన్య స్వరూపమనియు మరియు చైతన్య సహితమనియు వేదములలో తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మ యందు మార్పులు సంభవింపవు. మార్పురహితమైనట్టిదిగా అట్టి ఆత్మ సదా అణురూపమున నిలిచియుండును. పరమాత్ముడు అనంతుడు కాగా, అణురూప ఆత్మ అత్యంత సూక్ష్మమైయున్నది.
కావుననే మార్పురహితమగు సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతమైన పరమాత్మతో(భగవానునితో) సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని నిర్దారించుటకే ఈ సిద్ధాంతము వేదములందు పలురీతులుగా మరల మరల వివరింపబడినది. దోషరహితముగా ఒక విషయమును గూర్చి మనము అవగతము చేసికొనుటకై మరల మరల వివిరించుట అత్యంత అవరసరము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 72 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 25 🌴
25. avyakto ’yam acintyo ’yam avikāryo
’yam ucyate tasmād evaṁ viditvainaṁ nānuśocitum arhasi
🌻 Translation :
It is said that the soul is invisible, inconceivable and immutable. Knowing this, you should not grieve for the body.
🌻 Purport :
As described previously, the magnitude of the soul is so small for our material calculation that he cannot be seen even by the most powerful microscope; therefore, he is invisible.
As far as the soul’s existence is concerned, no one can establish his existence experimentally beyond the proof of śruti, or Vedic wisdom. We have to accept this truth, because there is no other source of understanding the existence of the soul, although it is a fact by perception. There are many things we have to accept solely on grounds of superior authority.
No one can deny the existence of his father, based upon the authority of his mother. There is no source of understanding the identity of the father except by the authority of the mother. Similarly, there is no source of understanding the soul except by studying the Vedas. In other words, the soul is inconceivable by human experimental knowledge.
The soul is consciousness and conscious – that also is the statement of the Vedas, and we have to accept that. Unlike the bodily changes, there is no change in the soul. As eternally unchangeable, the soul remains atomic in comparison to the infinite Supreme Soul. The Supreme Soul is infinite, and the atomic soul is infinitesimal.
Therefore, the infinitesimal soul, being unchangeable, can never become equal to the infinite soul, or the Supreme Personality of Godhead. This concept is repeated in the Vedas in different ways just to confirm the stability of the conception of the soul. Repetition of something is necessary in order that we understand the matter thoroughly, without error.
🌹🌹🌹🌹🌹
13 Jul 2019