శ్రీమద్భగవద్గీత - 070: 02వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 070: Chap. 02, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 70 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 23 🌴

23. నైనం చిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావక: |
న చైనం క్లేక్లేదయన్త్యాపో న శోషయతి మారుత: ||



🌷. తాత్పర్యం :

ఆత్మ ఎత్తి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే శోషింపబడదు.

🌷. భాష్యము :

ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయవ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు.

ఆధునిక అగ్ని అస్త్రములతో పాటు పృథివి, జలము,వాయువు,ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు సైతము పలుగాలవని తెలియవచ్చుచున్నది. ఈనాటి అణ్వస్త్రములు ఆగ్నేయాస్త్రములు కోవకు చెందినవి. కాని పూర్వపు అస్త్రములు అన్నిరకములైన భౌతిక ములకములతో చేయబడి యుండెడివి.

ఆగ్నేయాస్త్రములు వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతుల నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రమునకు తెలియవు. అదే కాకుండా వాయవ్యాస్త్రములు గూర్చి నవీన శాస్త్రజ్ఞులకు ఏమాత్రము జ్ఞానము లేదు. ఏదిఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను (అవి ఎంతటి వైజ్ఞానికములైననను) ఆత్మ చేదింపబడదు లేదా నశింపబడదు.

ఏ విధముగా ఆత్మ అజ్ఞానముచే ఉనికి లోనికి వచ్చి ఆపై మాయచే కప్పబడుచున్నదో మాయవాదులు వివరింపలేరు. అలాగుననే మూలమైన పరమాత్మా నుండి ఆత్మలను ఖండించుటయు సాధ్యమయిన విషయము కాదు.

వాస్తవమునకు ఆత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడియుండెడి అంశలు. నిత్యముగా(సనాతముగా) విడివడియుండెడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడునవై యున్నవి. అగ్నికణములు అగ్ని గునమునే కలిగియున్నట్లు, భగవానుని సాహచార్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడిగలవు. జీవులు శ్రీకృష్ణభగవానుని నుండి విడివడియున్న అంశలుగా వరాహపురాణమునందు వర్ణింపబడినది.

భగవద్గీత ప్రకారము కుడా ఈ విషయము సత్యమై యున్నది. కావున మాయ నుండి ముక్తి పొందిన పిదపయు జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే యుండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు ఒసగిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము వలన అర్జునుడు ముక్తిని పొందెనే గాని శ్రీకృష్ణునితో ఎన్నడును ఏకము కాలేదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 70 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 23 🌴

23. nainaṁ chindanti śastrāṇi nainaṁ dahati pāvakaḥ
na cainaṁ kledayanty āpo na śoṣayati mārutaḥ



🌻 Translation :

The soul can never be cut to pieces by any weapon, nor burned by fire, nor moistened by water, nor withered by the wind.

🌻 Purport :

All kinds of weapons – swords, flame weapons, rain weapons, tornado weapons, etc. – are unable to kill the spirit soul. It appears that there were many kinds of weapons made of earth, water, air, ether, etc., in addition to the modern weapons of fire. Even the nuclear weapons of the modern age are classified as fire weapons, but formerly there were other weapons made of all different types of material elements.

Fire weapons were counteracted by water weapons, which are now unknown to modern science. Nor do modern scientists have knowledge of tornado weapons. Nonetheless, the soul can never be cut into pieces, nor annihilated by any number of weapons, regardless of scientific devices.

The Māyāvādī cannot explain how the individual soul came into existence simply by ignorance and consequently became covered by the illusory energy. Nor was it ever possible to cut the individual souls from the original Supreme Soul; rather, the individual souls are eternally separated parts of the Supreme Soul.

Because they are atomic individual souls eternally (sanātana), they are prone to be covered by the illusory energy, and thus they become separated from the association of the Supreme Lord, just as the sparks of a fire, although one in quality with the fire, are prone to be extinguished when out of the fire. In the Varāha Purāṇa, the living entities are described as separated parts and parcels of the Supreme.

They are eternally so, according to the Bhagavad-gītā also. So, even after being liberated from illusion, the living entity remains a separate identity, as is evident from the teachings of the Lord to Arjuna. Arjuna became liberated by the knowledge received from Kṛṣṇa, but he never became one with Kṛṣṇa.

🌹🌹🌹🌹🌹


11 Jul 2019