శ్రీమద్భగవద్గీత - 068: 02వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 068: Chap. 02, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 68 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 21 🌴


21. వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పరుష: పార్థ కం ఘాతయతి హన్తి కం ||

🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ఆత్మ నాశము లేనిదనియు, నిత్యమైనదనియు, పుట్టుకలేనిదనియు, అవ్యయమైనదనియు తెలిసినవాడు ఎవ్వరినేని ఎట్లు చంపును? లేదా చంపించును?

🌷. భాష్యము :

వాస్తవమునకు ప్రతిదానికి ఒక ప్రయోజనముండును. పూర్ణజ్ఞానవంతుడైనవాడు ఎచ్చట మరియు ఏవిధముగా ఒకదానిని సరియైన ప్రయోజనము కొరకై వినియోగించవలేనో తెలిసియుండును. అలాగుననే హింసకు సైతము ఒక ప్రయోజనమున్నది. కాని దానిని ఎట్లు వినియోగించవలెనన్న విషయమును జ్ఞానవంతుడు ఎరిగియుండును.

హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాడు. ఏలయన అతడు ఉరిశిక్ష యను హింసను న్యాయసూత్రముల ననుసరించియే అమలుపరచును. హత్య గావించినవానికి మరణదండన విధింపబడవలెననియు, తద్ రీతినే చేసిన ఘోరపాపమునకు అతడు మరుసటి జన్మలో దుఃఖభాగుడు కావలసిన అవసరము కలుగగలదని మానవధర్మ శాస్త్రమైన మనుసంహిత తెలియజేయుచున్నది.

అనగా హంతకుని రాజు ద్వారా విధింపబడెడి ఉరిశిక్ష లాభదాయకమైనదే. అలాగుననే శ్రీకృష్ణుడు యుద్ధమునకై ఆదేశింపగా అట్టి హింస పరమధర్మము కొరకేని నిర్దారింపవలసియున్నది. శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస యనునది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి అర్జునుడు అట్టి ఆదేశమును అనుసరింపవలెను. ఏలయన ఆత్మ యనునది వధింపబడునది కాదు.

కనుక న్యాయమును నెలకొల్పుటకై అట్టి నామమాత్ర హింస ఆమోదనీయమే. శస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకే గాని చంపుటకు కాదు. కావున శ్రీకృష్ణుని ఉపదేశమున అర్జునుడు ఒనరింపబోవు యుద్ధము జ్ఞానపూర్ణమై యున్నది. దాని యందు పాపమునకు ఏమాత్రము అవకాశము లేదు

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 68 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 21 🌴


21. vedāvināśinaṁ nityaṁ ya enam ajam avyayam kathaṁ sa puruṣaḥ pārtha kaṁ ghātayati hanti kam


🌻 Translation :

O Pārtha, how can a person who knows that the soul is indestructible, eternal, unborn and immutable kill anyone or cause anyone to kill?


🌻 Purport :

Everything has its proper utility, and a man who is situated in complete knowledge knows how and where to apply a thing for its proper utility. Similarly, violence also has its utility, and how to apply violence rests with the person in knowledge.

Although the justice of the peace awards capital punishment to a person condemned for murder, the justice of the peace cannot be blamed, because he orders violence to another person according to the codes of justice. In Manu-saṁhitā, the lawbook for mankind, it is supported that a murderer should be condemned to death so that in his next life he will not have to suffer for the great sin he has committed.

Therefore, the king’s punishment of hanging a murderer is actually beneficial. Similarly, when Kṛṣṇa orders fighting, it must be concluded that violence is for supreme justice, and thus Arjuna should follow the instruction, knowing well that such violence, committed in the act of fighting for Kṛṣṇa, is not violence at all because, at any rate, the man, or rather the soul, cannot be killed; so for the administration of justice, so-called violence is permitted.

A surgical operation is not meant to kill the patient, but to cure him. Therefore the fighting to be executed by Arjuna at the instruction of Kṛṣṇa is with full knowledge, so there is no possibility of sinful reaction.

🌹🌹🌹🌹🌹


9 Jul 2019