శ్రీమద్భగవద్గీత - 087: 02వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 087: Chap. 02, Ver. 40



🌹. శ్రీమద్భగవద్గీత - 87 / Bhagavad-Gita - 87 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 40 🌴

40. నేహాభీక్రమనాశోస్తి
ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్ ||



🌷. తాత్పర్యం :

ఈ ప్రయత్నము నందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్పపురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును.


🌻. భాష్యము :

కృష్ణభక్తిరసభావన యందు కర్మనొనరించుట (శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఎటువంటి భోగాభిలాష లేకుండా కర్మను చేయుట) యనునది మహోన్నత దివ్యకార్యము. అటువంటి కార్యమును కొద్దిగా ఆరంభిచినను అందు ఎటువంటి ఆటంకములు కలుగవు. అంతియేగాక అట్టి స్వల్పయత్నము ఏనాడును నశించిపోదు.

భౌతికపరిధిలో ప్రారంభింపబడు కర్మ ఒకనాటికి సంపూర్ణము చెందవలసియే యుండును. అట్లుకానిచో ఆ యత్నమంతయు విఫలము కాగలదు. కాని కృష్ణభక్తిభావనలో ప్రారంభించబడు కర్మ సంపూర్ణము కాకున్నను శాశ్వతప్రభావమును కలిగియుండును. అనగా కృష్ణభక్తిభావన యందలి తన కర్మ పూర్ణము కానప్పటికిని కర్త ఏ విధమైన నష్టమును పొందడు.

కృష్ణపరమగు కర్మ ఒక్క శాతము పూర్తియైనను శాశ్వత ఫలమును కలిగియుండి తదుపరి ప్రారంభము రెండవ శాతము నుండి మొదలగును. కాని లౌకికకర్మ యందు నూటికి నూరుపాళ్లు సఫలత కలుగనిదే లాభము చేకూరదు. అజామిళుడు తన ధర్మమును కృష్ణభక్తి భావనలో కొద్దిగానే నిర్వర్తించినను భగవానుని కరుణా వలన అంత్యమున నూటికినూరుపాళ్ళు ఫలితమును పొందెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 87 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 40 🌴

40. nehābhikrama-nāśo ’sti pratyavāyo na vidyate
sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt



🌻 Translation :

In this endeavor there is no loss or diminution, and a little advancement on this path can protect one from the most dangerous type of fear.


🌻 Purport :

Activity in Kṛṣṇa consciousness, or acting for the benefit of Kṛṣṇa without expectation of sense gratification, is the highest transcendental quality of work. Even a small beginning of such activity finds no impediment, nor can that small beginning be lost at any stage. Any work begun on the material plane has to be completed, otherwise the whole attempt becomes a failure.

But any work begun in Kṛṣṇa consciousness has a permanent effect, even though not finished. The performer of such work is therefore not at a loss even if his work in Kṛṣṇa consciousness is incomplete.

One percent done in Kṛṣṇa consciousness bears permanent results, so that the next beginning is from the point of two percent, whereas in material activity without a hundred percent success there is no profit. Ajāmila performed his duty in some percentage of Kṛṣṇa consciousness, but the result he enjoyed at the end was a hundred percent, by the grace of the Lord.

🌹 🌹 🌹 🌹 🌹


27 Jul 2019