శ్రీమద్భగవద్గీత - 080: 02వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 080: Chap. 02, Ver. 33


🌹. శ్రీమద్భగవద్గీత - 80 / Bhagavad-Gita - 80 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 33 🌴

33. అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తత: స్వధర్మ్యం కీర్తిం చ హిత్వా పాప మువాప్స్యసి ||


🌷. తాత్పర్యం :

ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్దమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచి నందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడవనెడి కీర్తిని నీవు పోగొట్టుకొందువు.


🌷. భాష్యము :

అర్జునుడు ప్రసిద్ధి గాంచిన యోధుడు. శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధమొనర్చి అతడు కీర్తిని బడసెను. వేటగాని రూపములో నున్న శివుని అర్జునుడు రణమునందు ఓడించెను. ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండు పాశుపాతాస్త్రమును బహుమతిగా పొందెను. కనుకనే అర్జునుడు గొప్ప యోధుడని సర్వులు ఎరుగుదురు.

ద్రోణాచార్యుడు సైతము అతనికి అనేక వరములను మరియు గురువును సైతము వధింపగల విశేష శక్తివంతమైన ఆయుధమును నొసగెను. ఈ విధముగా అర్జునుడు పలువురు మహానుభావుల నుండు యుద్ధమునకు కావలసిన యోగ్యతలను సాధించెను. స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండియు అతడు వరములను పొందెను.

కాని ఇప్పుడు అతడు యుద్దమును త్యజించినచో క్షత్రియునిగా తన ధర్మమును అలక్ష్య పరచిన వాడగుటయే గాక, పేరు ప్రతిష్టలను కోల్పోయి నరకమునకు రాచమార్గమును తయారు చేసికొనిన వాడగును. అనగా వేరు మాటలలో యుద్దమును చేయుట వలన గాక, దాని నుండి విరమించుట ద్వారా అతడు నరకమును పొందగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 80 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 33 🌴

33. atha cet tvam imaṁ dharmyaṁ saṅgrāmaṁ na kariṣyasi tataḥ sva-dharmaṁ kīrtiṁ ca hitvā pāpam avāpsyasi



🌻 Translation :

If, however, you do not perform your religious duty of fighting, then you will certainly incur sins for neglecting your duties and thus lose your reputation as a fighter.


🌻 Purport :

Arjuna was a famous fighter, and he attained fame by fighting many great demigods, including even Lord Śiva. After fighting and defeating Lord Śiva in the dress of a hunter, Arjuna pleased the lord and received as a reward a weapon called pāśupata-astra.

Everyone knew that he was a great warrior. Even Droṇācārya gave him benedictions and awarded him the special weapon by which he could kill even his teacher. So he was credited with so many military certificates from many authorities, including his adoptive father Indra, the heavenly king.

But if he abandoned the battle, not only would he neglect his specific duty as a kṣatriya, but he would lose all his fame and good name and thus prepare his royal road to hell. In other words, he would go to hell not by fighting but by with drawing from battle.

🌹 🌹 🌹 🌹 🌹

21 Jul 2019