🌹. శ్రీమద్భగవద్గీత - 79 / Bhagavad-Gita - 79 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 32 🌴
32. యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖిన: క్షత్రియా: పార్థ లభన్తే యుద్ధమీదృశమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్దావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు.
🌷. భాష్యము :
“ఈ యుద్ధము నందు ఎటువంటి శుభమును నేను గాంచుట లేదు. ఇది శాశ్వతమగు నరకవాసమునే గూర్చును.” అని పలికిన అర్జునుని నైజమును జగద్గురువైన శ్రీకృష్ణుడు నిరసించుచున్నాడు. అర్జునుని అట్టి పలుకులు కేవలము అజ్ఞానజనితములు. అతడు తన విధ్యుక్తధధర్మ నిర్వహణమునందు అహింసను పాటింపదలచెను. క్షత్రియుడైనవాడు యుద్ధరంగమునందు అహింసను పాటించుట యనునది మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని జనకుడు మరియు గొప్ప ఋషియైన పరాశరుడు రచించిన పరాశరుడు రచించిన పరాశరస్మృతి యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణి: ప్రదణ్డయన్ |
ననిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్ ||
“పౌరులకు అన్నిరకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మమై యున్నందున అవసరమగు విషయములందు శాంతిభద్రతల పరిరక్షణకై హింసను చేపట్టవలసి యుండును. కావున అతడు శత్రురాజుల సైన్యమును జయించి, తదుపరి ధర్మబద్దముగా రాజ్యమును పాలించెను.
ఈ విషయమున నన్నింటిని బట్టి అర్జునుడు యుద్దమును త్యజించుటకు ఎట్టి కారణము లేదు. శత్రువులను జయించినచో రాజ్యమును అతడు అనుభవింపగలడు. ఒకవేళ యుద్ధరంగమునందు మరణించినచో ద్వారములు తెరువబడియున్న స్వర్గమునకు అతడు చేరగలడు. కావున ఏ విధముగా గాంచినను యుద్ధమే అతనికి లాభదాయకమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 79 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 32 🌴
32. yadṛcchayā copapannaṁ svarga-dvāram apāvṛtam sukhinaḥ kṣatriyāḥ pārtha labhante yuddham īdṛśam
🌻 Translation :
O Pārtha, happy are the kṣatriyas to whom such fighting opportunities come unsought, opening for them the doors of the heavenly planets.
🌻 Purport :
As supreme teacher of the world, Lord Kṛṣṇa condemns the attitude of Arjuna, who said, “I do not find any good in this fighting. It will cause perpetual habitation in hell.” Such statements by Arjuna were due to ignorance only. He wanted to become nonviolent in the discharge of his specific duty. For a kṣatriya to be on the battlefield and to become nonviolent is the philosophy of fools. In the Parāśara-smṛti, or religious codes made by Parāśara, the great sage and father of Vyāsadeva, it is stated:
kṣatriyo hi prajā rakṣan śastra-pāṇiḥ pradaṇḍayan nirjitya para-sainyādi kṣitiṁ dharmeṇa pālayet
“The kṣatriya’s duty is to protect the citizens from all kinds of difficulties, and for that reason he has to apply violence in suitable cases for law and order. Therefore he has to conquer the soldiers of inimical kings, and thus, with religious principles, he should rule over the world.”
Considering all aspects, Arjuna had no reason to refrain from fighting. If he should conquer his enemies, he would enjoy the kingdom; and if he should die in the battle, he would be elevated to the heavenly planets, whose doors were wide open to him. Fighting would be for his benefit in either case.
🌹 🌹 🌹 🌹 🌹
20 Jul 2019