శ్రీమద్భగవద్గీత - 073: 02వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 073: Chap. 02, Ver. 26
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 73 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 26 🌴
26. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మాహాబాహో నైనం శోచితుమర్హసి ||
తాత్పర్యం :
ఓ మహాబాహో! ఒకవేళ నీవీ ఆత్మ ( లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు.
భాష్యము :
దేహమునకు పరముగా ఆత్మ కోక ప్రత్యేక ఉనికి కలదని అంగీకరింపని తత్త్వవేత్తల తెగ ఒకటి ఎల్లప్పుడు ఉండును. వారు దాదాపు బౌద్ధులను పోలినట్టివారు. శ్రీకృష్ణభగవానుడు గీతను తెలియజేసిన కాలమునందు అట్టివారు ఉన్నట్లుగా గోచరించుచున్నది. “లోకాయతికులు” మరియు “వైభాషికులు” అని తెలియబడు అట్టి తత్త్వవేత్తలు మూలకముల సరియైన సమ్మేళనము వలన జీవనము కలుగునని పలుకుదురు.
నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్త్వవేత్తలు సైతము అదేవిధముగా తలతురు. వారి సిద్ధాంతము ప్రకారము మూలకముల కలయికలో కొన్ని భౌతిక, రసాయయనచర్యల వలన జీవము కలుగుచున్నది. నవీన మానవశాస్త్రములు ఇట్టి సిద్ధాంతము పైననే ఆధారపడియున్నది. పలు కుహునా ధర్మములు ఈ సిద్ధాంతమును మరియు భక్తిరహితమైన బౌద్ధవాదమును అనుసరించుచు అమెరికాదేశమునందు ప్రాచుర్యము నొందుచున్నది.
ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతము వలె ఆత్మ ఉనికిని గుర్తింపకున్నను దుఃఖించుటకు కారణము లేదు. కొన్ని రసాయనములు నష్టము వలన ఎవ్వరును చింతాక్రంతులై విధ్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక యుద్ధపద్ధతిన శత్రువుపై విజయమును పొందుటకు మనుజుడు టన్నుల పరిమాణములో రసాయనములను వృథా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతముప్రకారము దేహముతో పాటు ఆత్మ నశించును. కావున అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేదంనిర్ణయమును అంగీకరించినను లేదా ఆత్మ ఉనికిని నిరాకరించినను చింతించుటకు ఎట్టి కారణము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 73 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 26 🌴
26. atha cainaṁ nitya-jātaṁ nityaṁ vā manyase mṛtam tathāpi tvaṁ mahā-bāho nainaṁ śocitum arhasi
🌻 Translation :
If, however, you think that the soul [or the symptoms of life] will always be born and die forever, you still have no reason to lament, O mighty-armed.
🌻 Purport :
There is always a class of philosophers, almost akin to the Buddhists, who do not believe in the separate existence of the soul beyond the body. When Lord Kṛṣṇa spoke the Bhagavad-gītā, it appears that such philosophers existed, and they were known as the Lokāyatikas and Vaibhāṣikas. Such philosophers maintain that life symptoms take place at a certain mature condition of material combination. The modern material scientist and materialist philosophers also think similarly.
According to them, the body is a combination of physical elements, and at a certain stage the life symptoms develop by interaction of the physical and chemical elements. The science of anthropology is based on this philosophy. Currently, many pseudo religions – now becoming fashionable in America – are also adhering to this philosophy, as are the nihilistic nondevotional Buddhist sects.
Even if Arjuna did not believe in the existence of the soul – as in the Vaibhāṣika philosophy – there would still have been no cause for lamentation. No one laments the loss of a certain bulk of chemicals and stops discharging his prescribed duty. On the other hand, in modern science and scientific warfare, so many tons of chemicals are wasted for achieving victory over the enemy.
According to the Vaibhāṣika philosophy, the so-called soul or ātmā vanishes along with the deterioration of the body. So, in any case, whether Arjuna accepted the Vedic conclusion that there is an atomic soul or he did not believe in the existence of the soul, he had no reason to lament.
🌹 🌹 🌹 🌹 🌹
14 Jul 2019